పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-1009-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధీతతో మత్పదసర
సీరుహసేవానురక్తిఁ జెందినవారల్
నారీసంగము నిరయ
ద్వాముగా మనము లందు లఁపుదు రెపుడున్.

టీకా:

ధీరత = ధైర్యము; తోన్ = తోటి; మత్ = నా యొక్క; పద = పాదములు అనెడి; సరసీరుహ = పద్మముల; సేవా = కొలుచుట యందు; అనురక్తిన్ = కూరిమిని; చెందిన = కలిగించుకొన్న; వారల్ = వారు; నారీ = స్త్రీలతోడి; సంగము = తగులము; నిరయ = నరకమునకు; ద్వారముగ = ప్రవేశింపజేయునదిగా; మనములన్ = మనస్సులలో; తలపుదురు = తలచెదరు; ఎపుడున్ = ఎప్పుడును.

భావము:

స్థిరబుద్ధితో నా పాదపద్మాలను సేవించడంలో ఆసక్తి కలవారు స్త్రీసాంగత్యాన్ని నరకద్వారంగా మనస్సులలో భావిస్తారు.