పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-1006.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్ధ కేళీమృగంబుల గిదిఁ దగిలి
రవశస్వాంతముల శోచ్యభావు లైన
వారి సంగతి విడువంగ లయు నందు
నంగనాసంగమము దోష మండ్రు గాన.

టీకా:

జనయిత్రి = తల్లీ; సత్యంబున్ = సత్యమును; శౌచంబున్ = శౌచమును, శుచియును; దయయునున్ = దయయును; ధృతియున్ = ధైర్యమును; మౌనంబునున్ = మౌనము; బుద్ధియునున్ = బుద్ధియును; సిగ్గు = సిగ్గును; క్షమయునున్ = ఓర్పును; యశమునున్ = కీర్తియును; శమమునున్ = శమమును; దమమునున్ = దమమును; మొదలుగాగల = మొదలైన; గుణంబులున్ = గుణములు; నశించున్ = చెడిపోవును; జనుల్ = జనముల; కున్ = కు; అసత్సంగమునన్ = చెడుసహవాసములు వలన; అని = అని; ఎఱిగించి = తెలిపి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అను = పలికెను; వినుము = వినుము; మూఢ = మోహము చెందిన; హృదయులు = హృదయములు కలవారు; శాంతి = శాంతి; విహీనులు = లేనివారు; దేహ = దేహమే; ఆత్మ = తాము; బుద్ధులు = అనుకొనువారు; అంగనా = స్త్రీ; మోహ = మోహము అనెడి; పాశ = పాశములచే; బద్ధ = బంధింపబడిన; కేళీ = పెంపుడు; మృగంబుల్ = జంతువుల;
పగిదిన్ = వలె; తగిలి = తగుల్కొని; పరవశ = పరవశించుచున్న; స్వాంతములన్ = మనస్సులతో; శోచ్య = శోకింపదగిన, శోచనీయమైన; భావులు = భావములు కలవారు; ఐన = అయినట్టి; వారి = వారి యొక్క; సంగతిన్ = సాంగత్యమును; విడువంగవలయున్ = విడిచిపెట్టవలసినది; అందున్ = వానిలోను; అంగనా = స్త్రీలతో; సంగమము = సాంగత్యము; దోషము = మిక్కిలి చెడ్డది; అండ్రు = అందురు; కాన = కావున.

భావము:

అమ్మా! దుర్మార్గుల సాంగత్యంవల్ల సత్యం, శుచిత్వం, దయ, ధ్యైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి” అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. “మూఢ హృదయులు, శాంతి లేనివాళ్ళు, దేహమే ఆత్మ అని భావించేవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మృగాలలాగా పరులకు వశమైన బుద్ధి కలవారు శోచనీయులు. అటువంటివారి సాంగత్యం వదలిపెట్టాలి. అందులోను స్త్రీసాంగత్యం బలీయమైన దోషం అని ప్రాజ్ఞులంటారు కదా!