పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-1001.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యాత్మ కనయంబు సారథి యైన యట్టి
రుచిర విజ్ఞానమునఁ దమోరూపమైన
భూరి సంసారసాగరోత్తాణంబు
సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు.

టీకా:

నెలకొని = పూనుకొని; బహు = అనేకమైన; దుఃఖముల్ = దుఃఖముల; కున్ = కు; ఆలయమున్ = స్థానము; ఐన = అయినట్టి; ఈ = ఈ; గర్భ = గర్భము అనెడి; నరకమున్ = నరకమును; నేనున్ = నేను; వెడలన్ = బయటపడ; చాలన్ = లేను; బహిర్ = వెలుపలి; ప్రదేశము = చోటున; కున్ = కు; వచ్చినన్ = వచ్చినను; అనుపమ = సాటిలేని; దేవ = దేవుని యొక్క; మాయా = మాయచే; విమోహిత = మిక్కిలి మోహమున పడిన; ఆత్ముడను = ఆత్మకలవాడను; ఐ = అయ్యి; ఘోరము = ఘోరము; ఐనట్టి = అయినట్టి; సంసార = సంసారము అనెడి; చక్రమున్ = చక్రము; అందున్ = లోపల; పరిశ్రమ = మిక్కిల కష్టపడు; శీలిన్ = స్వభావము కలవాడను; ఐ = అయ్యి; ఉండన్ = ఉండ; వలయున్ = వలసినదే; అది = అంతే; కాక = కాకుండగా; గర్భంబున్ = గర్భము; అందు = లోపల; ఉండు = ఉండెడి; శోకంబున్ = దుఃఖమును; అపనయించి = తొలగించి;
ఆత్మ = ఆత్మ; కున్ = కు; అనయంబున్ = నిత్యము; సారథి = మార్గదర్శి; ఐన = అయిన; అట్టి = అటువంటి; రుచిర = చక్కటి; విజ్ఞానమునన్ = విఙ్ఢానముతో; తమస్ = చీకటి; రూపము = స్వరూపము; ఐన = అయిన; భూరి = అతిమిక్కిలిపెద్దదైన {భూరి - అతి పెద్ధసంఖ్య 1 తరవాత 34 సున్నాలు కలది అదే లక్ష అయితే 5 సున్నాలు మాత్రమే}; సంసార = సంసారము అనెడి; సాగర = సముద్రమును; ఉత్తరణంబున్ = దాటుటను; చేసి = చేసి; ఈ = ఈ; ఆత్మనున్ = ఆత్మను; అరసి = తెలుసుకొని; రక్షించుకొందు = రక్షించుకొనెదను.

భావము:

‘ఎన్నెన్నో దుఃఖాలకు నిలయమైన ఈ గర్భనరకం నుండి నేను బయట పడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఈ గర్భశోకాన్ని పోగొట్టేదీ, ఆత్మను సారథియై నడిపించేదీ అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార సాగరాన్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను.