పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-986.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూపమయిన తమముచే నిరూఢుఁ డగుచు
వెలయఁ దొంబదితొమ్మిదివేల యోజ
ముల దూరంబు గల యమగరమునకుఁ
బూని యమభటుల్ కొంపోవఁ బోవు నంత.

టీకా:

అనుపమ = సాటిలేని; క్షుత్ = ఆకలి; తృష్ణలన్ = దాహములు; అంతర్ = లోపలనుండి; వ్యధలన్ = బాధలను; చేయన్ = కలుగజేయగా; ఝంఝానిల = పెనుగాలియును; జ్వలత్ = మండుచున్న; జ్వలన = మంటలవలె; చండ = భయంకరమైన; భాను = సూర్యునిచే; ప్రదీప్తంబున్ = వెలిగించబడుతున్నది; ఐన = అయినట్టి; వాలుకా = ఇసుక; మార్గ = దారిని; అనుగత = అనుసరించు; తప్యమాన = కాలుతున్న; గాత్రుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి; వీపున్ = వీపున; కశల్ = కొరడాల; చేన్ = చేత; అడువంగ = బాదుతుండగా; వికల = విరిగిన; అంగుడున్ = అవయవములు కలవాడు; అగుచున్ = అవుతూ; మార్గమున్ = దారి; అందున్ = లో; అచటనచటన్ = అక్కడక్కడ; చాలన్ = ఎక్కువగా; మూర్చిల్లి = మూర్ఛపడి; ఆశ్రయ = దిక్కు; శూన్యము = మాలినవి; అగు = అయిన; నీళ్ళన్ = నీటిలో; మునుగుచున్ = ములుగుతూ; లేచుచున్ = లేస్తూ; మొనసి = ముసిరిన; పాప = పాపము యొక్క;
రూపమునన్ = రూపములో ఉన్న; తమము = చిమ్మచీకటి; చేన్ = చేత; నిరూఢుండు = వాడబడుతున్నవాడు; అగుచున్ = అవుతూ; వెలయన్ = ప్రసిద్ధముగ; తొంబదితొమ్మిదివేల = తొంభైతొమ్మిదివేల (99, 000) (99,000 యోజనములు అంటే సుమారు 1217243.4 కిమీ., లేదా 756360 మైళ్ళు); యోజనముల = యోజనముల; దూరంబున్ = దూరము; కల = కలిగిన; యమనగరంబున్ = యమపురి; కున్ = కి; పూని = పూని; యమభటుల్ = యమకింకరులు; కొంపోవపోవునంత = తీసుకెళ్ళిపోతుండగా.

భావము:

ఎడతెగని ఆకలి దప్పులతో లోలోపల వ్యాకులపడుతూ, సుడిగాలుల మధ్య సోలిపోతూ, భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్ళు కాలుతూ నడవలేక నడుస్తూ, కొరడా దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అచ్చటచ్చట మూర్ఛిల్లుతూ, దిక్కుమాలిన నీళ్ళలో మునిగితేలుతూ, పాపంలా క్రమ్ముకొన్న చిమ్మచీకటిలోనుంచి తొంబది తొమ్మిది వేల యోజనాల దూరంలో ఉన్న యమపట్టణానికి యమభటులచేత తీసుకొని పోబడతాడు.