పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-983-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిరోగ పీడితుండై మంద మగు జఠ-
రాగ్నిచే మిగుల నల్పాశి యగుచు
మెఱసి వాయువుచేత మీఁదికి నెగసిన-
న్నులు కఫమునఁ ప్పబడిన
నాళంబులను గంఠనాళంబునను ఘుర-
ఘుర మను శబ్దము దొరయ బంధు
నుల మధ్యంబున యనించి బహువిధ-
ములఁ దన్ను బిలువంగ లుకలేక

3-983.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టులతర కాలపాశవశంగతాత్ముఁ
గుచు బిడ్డలఁ బెండ్లాము రసి ప్రోచు
చింత వికలములైన హృషీకములును
లిగి విజ్ఞానమును బాసి ష్టుఁ డగుచు.

టీకా:

అతి = అధికముగ; రోగ = రోగములతో; పీడితుండు = బాధింపబడువాడు; ఐ = అయ్యి; మందము = తగ్గినది; అగు = అయిన; జఠరాగ్ని = జీర్ణశక్తి; చేన్ = చేత; మిగులన్ = మిక్కిలి; అల్ప = కొంచమే; ఆశి = తినువాడు; అగుచున్ = అవుతూ; మెఱసి = ఉద్రేకించిన; వాయువు = వాయువు; చేతన్ = వలన; మీది = పై; కిన్ = కి; ఎగసిన = ఎగసిన; కన్నులు = కళ్ళు; కఫమునన్ = శ్లేష్మముచే; కప్పబడిన = పూడుకుపోయిన; నాళంబులను = నాసాది నాళములును; కంఠ = కంఠము యొక్క; నాళమునను = నాళమునుండి; ఘురఘుర = గురగుర; అను = అనెడి; శబ్దమున్ = ధ్వనులు; తొరయన్ = కలుగుతుండగ; బంధు = బంధువులైన; జనుల = జనములు; మధ్యంబునన్ = మధ్యలో; శయనించి = పడుకొని; బహు = అనేక; విధములన్ = విధములుగా; తన్నున్ = తనను; పిలువంగా = పిలవగా; పలుక = మారు పలుక; లేక = లేక;
చటులతర = మిక్కిలి భయంకరమైన {చటులము- చటుల తరము - చటులతమము}; కాలపాశ = యముని పాశములకు; వశంగత = లొంగిపోయిన; ఆత్ముడున్ = ఆత్మకలవాడు; అగుచున్ = అవుతూ; బిడ్డలన్ = పిల్లలను; పెండ్లామున్ = భార్యను; అరసి = కనుగొని, కనిపెట్టి; ప్రోచు = కాపాడెడి; చింతన్ = బాధతో; వికలములు = కలవరపెడుతున్నవి; ఐన = అయిన; హృషీకములును = ఇంద్రియములును; కలిగి = ఉండి; విజ్ఞానమున్ = తెలివి; పాసి = తప్పిపోయి; కష్టుడు = కష్టపడుతున్నవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

నానావిధాలైన వ్యాధులు బాధించగా, జఠరాగ్ని మందగించగా, తిండి పడిపోయి, ఆయాసం అతిశయించి, మిడిగ్రుడ్లు పడి, కంఠనాళం మూసుకుపోయి, గొంతులో గురక పుట్టి, బంధువుల అందరిమధ్య పండుకొని, వారు తనను పలుకరిస్తూంటే బదులు పలకడానికి నోరు పెకలక, భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకోగా, భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమై పోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయినవాడై గిలగిలలాడుతూ...