పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-982-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెరూపు దాల్చి బాంధవు
లఁగ నిర్యాణమునకు భిముఖుఁడై యి
ల్వెలఁగజాలక శునకము
డువునఁ గుడుచుచును మేను డవడ వడఁకన్

టీకా:

వెడ = వికృత; రూపు = రూపము; తాల్చి = ధరించి; బాంధవులున్ = బంధువులు; అడలగన్ = భయపడుతుండగ; నిర్యాణమున్ = మరణమున; కున్ = కు; అభిముఖుడు = ఎదురుపడ్డవాడు; ఐ = అయ్యి; ఇల్లు = ఇంటినుండి; వెడలగన్ = బయటకు పోవుటకు; చాలక = శక్తి లేక; శునకము = కుక్క; వడువునన్ = వలె; కుడుచుచున్ = తింటూ; మేనున్ = శరీరము; వడవడ = గజగజ; వడకన్ = వణుకుతుండగా.

భావము:

రూపం మారిపోగా, బంధువులందరూ ఏవగిస్తుండగా, అంత్యకాలం సమీపించగా, గడప దాటి వెళ్ళలేక కుక్కలా తింటూ, శరీరంలో వణుకు పుట్టుకురాగా...