పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-981.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుగు ముసలెద్దు రోసిన గిది నంత
తఁడు నేవెంటలను సుఖం బందలేక
తాను బోషించు జనులు దన్ నరఁ బ్రోవ
బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపఱుప.

టీకా:

బలిమి = శక్తి; చాలక = సరిపడక; మంద = మందగించిన; భాగ్యుడు = అదృష్టము కలవాడు; ఐ = అయ్యి; కుమతి = దుర్భుద్ధి; ఐ = అయ్యి; పూని = పూని; అపుడున్ = అప్పుడు; క్రియా = పని; హీనుడు = లేనివాడు; అగుచున్ = అవుతూ; తవిలి = చిక్కుకొని; వృథా = వ్యర్థపు; ప్రయత్నంబులున్ = ప్రయత్నములు; చేయుచున్ = చేస్తూ; మూఢుడు = మోహమున పడినవాడు; ఐ = అయ్యి; కార్పణ్యమున = దీనత్వముతో; చరించున్ = ప్రవర్తిల్లుతుండు; అట్టి = అటువంటి; అకించనుడు = దరిద్రుడు; అగు = అయిన; వానిన్ = వానిని; చూచి = చూసి; తత్ = ఆ; దార = భార్య; సుత = సంతానము; ఆదులు = మొదలైనవారు; ఆత్మలను = మనస్సులలో; వీడు = వీడు; కడున్ = మిక్కిలి; అశక్తుడు = బలహీనుడు; ప్రోవగాన్ = పోషించుటకు; చాలడు = సమర్థుడుకాదు; ఇతడు = ఇతడు; అని = అని; సెగ్గింతురు = రోయుదురు, అసహ్యించుకొందురు; అర్థిన్ = కోరి; కృషీవలుండు = రైతు;
బడుగు = కృశించిన; ముసలి = ముసలి; ఎద్దున్ = ఎద్దును; రోసిన = అసహ్యించుకొనిన; పగిదిన్ = విధముగా; అంతన్ = అంతట; అతడు = అతడు; ఏ = ఏ; వెంటలను = దారిలోను; సుఖంబున్ = సుఖమును; అంద = పొంద; లేక = లేక; తానున్ = తను; పోషించు = పోషించెడి; జనుల్ = జనములు; తన్ = తనను; తనరన్ = అతిశయించి; ప్రోవన్ = పోషిస్తుండగ; బ్రతుకున్ = జీవించును; ముదిమి = ముసలి తనము; మిక్కిలి = అధికముగ; బాధ = బాధలు; పఱుపన్ = పెడుతుండగా.

భావము:

శక్తి చాలక, అదృష్టం సన్నగిల్లి, కుటిల బుద్ధితో ఏ విధమైన పనులూ చేయలేని సోమరిపోతై పనికిరాని ప్రయత్నాలు చేస్తూ, పరమ మూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. రైతు బక్కచిక్కిన ముసలి ఎద్దును అసహ్యించుకొన్నట్లు ఆ దరిద్రుణ్ణి చూచి అతని ఆలుబిడ్డలు ‘ఇతడు అశక్తుడు, ఈ పనికిమాలినవాడు మనలను పోషింపలేడు’ అని ఏవగించుకొంటారు. ఈవిధంగా అతడు ఎక్కడా ఏ విధంగానూ సుఖంలేక ఇన్నాళ్ళూ తాను ఎవరినైతే తిండిపెట్టి పోషించాడో వారు పెట్టే తిండి తింటూ, ముసలితనంతో మూలుగుతూ బాధగా బరువుగా బ్రతుకును ఈడుస్తూ (ఉంటాడు).