పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-975-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూని యసత్యంబులైన గృహక్షేత్ర-
శు ధన సుత వధూ బాంధవాది
వివిధ వస్తువులను ధ్రుముగా మది నమ్మి-
ఱలు దుర్మతి యగువాఁడు జంతు
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి-
ర్థి నయ్యై యోను లందుఁ జొరఁగ
నుగమించును వాని యందు విరక్తుండు-
కాక యుండును నరస్థుఁ డైన

3-975.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేహి యాత్మీయదేహంబు దివిరి వదల
లే తన కది పరమసౌఖ్యారంబు
గాఁగ వర్తించు నదియును గాక యతఁడు
దేమాయావిమోహితభావుఁ డగుచు.

టీకా:

పూని = పూని; అసత్యంబులు = నిజము కానివి; ఐన = అయినట్టి; గృహ = ఇల్లు; క్షేత్ర = పొలము; పశు = పశువులు; ధన = ధనము; సుత = సంతానము; వధూ = భార్య; బాంధవ = బంధువు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; వస్తువులను = వస్తువులను; ధ్రువముగా = స్థిరమైనవిగా; మదిన్ = మనసున; నమ్మి = నమ్మి; వఱలు = ప్రవర్తిల్లు; దుర్మతి = దుర్బుద్ధి; అగువాడు = అయినవాడు; జంతు = జంతువుల; సంఘాతము = గుంపులోది; అగు = అయిన; దేహ = శరీరముతోని; సంబంధమునన్ = సంబంధములందు; నిల్చి = ఉండి; అర్థిన్ = కోరి; అయ్యై = ఆయా; యోనులు = గర్భముల; అందున్ = లో; చొరగన్ = ప్రవేశించినవాడై; అనుగమించును = వెంటబడును; వాని = వాటి; అందున్ = అందే; విరక్తుండు = విరక్తి చెందినవాడు; కాక = కాకుండగ; ఉండును = ఉండును; నరకస్థుడు = నరకమునకు పోవువాడు; ఐనన్ = అయినను;
దేహి = జీవుడు; ఆత్మీయ = తన యొక్క; దేహంబున్ = శరీరమును; తివిరి = పూనుకొని; వదలన్ = వదలిపెట్ట; లేక = లేక; తన = తన; కున్ = కు; అది = అది; పరమ = అత్యంత; సౌఖ్య = సౌఖ్యమును; ఆకరంబున్ = కలిగించునది; కాగన్ = అయినట్లు; వర్తించున్ = నడచును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; అతడు = అతడు; దేవ = దేవుని; మాయా = మాయయందు; విమోహిత = మిక్కిలి మోహము చెందుటను; భావుడు = పొందినవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

అశాశ్వతాలైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు మొదలైన వస్తువులే శాశ్వతం అని నమ్మి దుష్టబుద్ధియైన మానవుడు అనేకప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు. వానిపట్ల విరక్తి చెందడు. నరకం అనుభవించిన తర్వాతకూడా దేహి తన దేహాన్ని వదలక అదే ఎంతో సుఖప్రద మైనదిగా భావించి దానినే అంటిపెట్టుకొని ఉంటాడు. అంతేకాక అతడు దేవుని మాయకు లొంగినవాడౌతాడు.