పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-966-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రళాక్షి! విను మచేన దేహములకంటెఁ-
జేతన దేహముల్ శ్రేష్ట మందుఁ
బ్రాణవంతంబులై స్పర్శనజ్ఞానంబు-
లుగు చైతన్యవృక్షములకంటె
నరసజ్ఞానసంలితచేతను లుత్త-
ములు రసజ్ఞానంబు లుగు వాని
కంటె గంధజ్ఞానలితబృందంబులు-
డు శ్రేష్ఠములు వానికంటె శబ్ద

3-966.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేదు లగుదురు శ్రేష్ఠమై వెలయు శబ్ద
విదులకంటెను సద్రూపవేదు లైన
వాయసాదులు శ్రేష్ఠముల్ వానికంటె
రుస బహుపాదు లుత్తముల్ వానికంటె

టీకా:

తరళాక్షి = తల్లి {తరళాక్షి - చలించునట్టి కన్నులు కలామె, స్త్రీ}; వినుము = వినుము; అచేతన = చేతనము లేని, ప్రాణము లేని; దేహముల్ = దేహములు; కంటెన్ = కంటెను; చేతన = చేతనము కలిగిన, ప్రాణములు కల; దేహముల్ = దేహములు; శ్రేష్ఠము = ఉత్తమము; అందున్ = వానిలో; ప్రాణవంతంబులు = ప్రాణములు కలిగినవి; ఐ = అయ్యి; స్పర్శన = స్పర్శను తెలియు; జ్ఞానంబున్ = జ్ఞానము; కలుగు = కలిగి ఉండు; చైతన్య = ప్రాణములు కలిగిన; వృక్షముల్ = చెట్ల; కంటెన్ = కంటెను; ఘన = గొప్పదైన; రస = రుచి తెలియు; జ్ఞాన = జ్ఞానముతో; సంకలిత = కూడిన; చేతనులు = ప్రాణులు; ఉత్తములు = ఉత్తమములు; రస = రుచి తెలియు; జ్ఞానంబున్ = జ్ఞానము; కలుగు = ఉన్న; వాని = వాని; కంటెన్ = కంటెను; గంధ = వాసన తెలియు; జ్ఞాన = జ్ఞానముతో; కలిత = కూడిన; బృందంబులున్ = సమూహములు; కడు = మిక్కిలి; శ్రేష్ఠములు = ఉత్తమములు; వాని = వాటి; కంటెన్ = కంటెను; శబ్ద = ధ్వని; వేదులు = తెలిసినవారు; అగుదురు = అవుతారు;
శ్రేష్ఠము = ఉత్తమము; ఐ = అయ్యి; వెలయు = ప్రసిద్ధులైన; శబ్ద = ధ్వని; విదులు = తెలిసినవారి; కంటెను = కంటెను; సత్ = మంచి; రూప = రూపమును; వేదులు = తెలిసినవారు; ఐనన్ = అయినట్టి; వాయస = కాకులు; ఆదులు = మొదలైనవి; శ్రేష్ఠముల్ = ఉత్తమములు; వాని = వాని; కంటెన్ = కంటెను; వరుసన్ = క్రమముగ; బహుపాదులు = అనేకమైన పాదములు కలవి; ఉత్తముల్ = ఉత్తమములు; వాని = వాని; కంటెన్ = కంటెను.

భావము:

“తల్లీ! విను. చైతన్యం లేని రాళ్ళురప్పలకంటే చైతన్యంగల చెట్లుచేమలు శ్రేష్ఠమైనవి. స్పర్శజ్ఞానంగల చెట్లకంటె రసజ్ఞానం (రుచిచూచే శక్తి) గల క్రిమికీటకాలు శ్రేష్ఠమైనవి. వీనికంటె గంధజ్ఞానం (వాసన చూసే శక్తి) కలవి మరీ శ్రేష్ఠం. వీనికంటె శబ్దజ్ఞానం (వినగల శక్తి) కలవి గొప్పవి. ఇలాంటి శబ్దజ్ఞానం కలవాని కంటె కూడా రూపజ్ఞానం (చూడగల శక్తి) కల కాకులు మొదలైనవి ఎంతో శ్రేష్ఠమైనవి. వానికంటే కూడా అనేక పాదాలు కల జెఱ్ఱులు మొదలైనవి శ్రేష్ఠం. వానికంటె...