పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-965.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థి నాచిత్తమున ముదం బందకుందు"
నుచు నెఱిఁగించి మఱియు నిట్లనియెఁ గరుణఁ
లిత సద్గుణ జటిలుఁ డక్కపిలుఁ డెలమిఁ
ల్లితోడ గుణవతీమల్లితోడ.

టీకా:

అబ్జాక్షి = తల్లీ {అబ్జాక్షి - అంబుజము (పద్మము)ల వంటి కన్నులు కలామె, స్త్రీ}; నిఖిల = సమస్తమైన; భూత = జీవుల; అంతరాత్ముడను = లోపల ఆత్మగ ఉండువాడను; ఐన = అయినట్టి; నా = నా; అందున్ = అందును; భూత = జీవ; గణంబున్ = జాలము; అందున్ = అందును; అతి = మిక్కిలి; భేద = భేదము కల; దృష్టిన్ = చూపు కలిగి; మాయావులు = మాయకలవారు; ఐ = అయ్యి; సతతంబున్ = నిత్యమును; పాయక = విడువక; వైర = శత్రుత్వమును; అనుబంధ = అనుసరించుట యందు; నిరతులు = మిక్కిలి ఆసక్తి కలవారు; అగు = అయిన; వారిన్ = వారి యొక్క; మనములన్ = మనస్సులను; తగులదు = చెందదు; శాంతి = శాంతి; ఎన్నటికిని = ఎప్పటికి; ఐనన్ = అయినను; నేనున్ = నేనుకూడ; ఆ = ఆ; కుటిల = వంకర; జనులన్ = వారిని; మానక = విడువక; ఎపుడున్ = ఎప్పుడును; సామాన్య = సామాన్యము కంటెను; అధిక = గొప్పవైన; ద్రవ్య = వస్తు; సమితి = సముదాయము; చేన్ = చేత; మత్ = నా యొక్క; పద = పాదములను; అర్చనమున్ = పూజలు; ఒనర్పన్ = చేసినను; అర్థిన్ = కోరి;
నా = నా యొక్క; చిత్తమునన్ = మనస్సులో; ముదంబున్ = సంతోషమును; అందక = చెందకుండగ; ఉందున్ = ఉందును; అనుచున్ = అంటూ; ఎఱిగించి = తెలిపి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; కరుణ = దయతో; కలిత = కూడిన; సత్ = మంచి; గుణ = గుణములు కల; జటిలుడు = మిక్కిలి నేర్పు కలవాడు, జటలుగల సన్యాసి; తల్లి = తల్లి; తోడన్ = తోటి; గుణవతీమతల్లి = సుగుణురాళ్ళలో ఉత్తమురాలు; తోడన్ = తోడన్.

భావము:

కమలాలవంటి కన్నులు గల తల్లీ! నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను. అటువంటి నాయందు, మిగిలిన జీవరాసుల యందు భేదదృష్టి కలిగి మాయావులై విరోధభావంతో మెలిగేవారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా, ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను. సంతోషించను” అని చెప్పి సతీమతల్లియైన తల్లితో ఉత్తమగుణధుర్యుడైన కపిలుడు ఇలా అన్నాడు.