పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-957-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హేగుణరహితుఁ డనఁగల
నా యందుల భక్తిలక్షముఁ దెలిపితి నన్
బాక నిర్హేతుకముగఁ
జేయు మదీయవ్రతైక చిరతరభక్తిన్.

టీకా:

హేయ = విడువదగిన; గుణ = గుణములు; రహితుండను = లేనివాడను; అనన్ = అనుటకు; కల = తగిన; నా = నా; అందుల = ఎడల చేయు; భక్తి = భక్తి యొక్క; లక్షణమున్ = లక్షణములను; తెలిపితిన్ = తెలియజేసితిని; నన్ = నన్ను; పాయక = విడువక; నిర్హేతుకముగన్ = కారణరహితముగ; చేయున్ = చేసేడి; మదీయ = నాయందలి; వ్రత = నిష్ఠయే; ఏక = ముఖ్యమైన; చిరతర = చాలాఎక్కువ కాల ముండెడి {చిరము- చిరతరము - చిరతమము}; భక్తిన్ = భక్తితో.

భావము:

నిందనీయాలైన గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను తెలిపాను. నన్ను వదలకుండా, హేతువులు వెదకకుండా చేసే వ్రతమే అచంచలమైన భక్తి అని భావించు.