పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

  •  
  •  
  •  

3-948-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుస ననన్యభావంబునఁ జేసి భూ-
తావళి యందుఁ దదాత్మకత్వ
మునఁ జూచు నాత్మీయ తరోపాదాన-
ముల యందుఁ దవిలి యిమ్ముల వెలుంగు
నిట్టి దివ్యజ్యోతి యేకమయ్యును బహు-
భావంబులను దోఁచు ప్రకృతిగతుఁడు
గుచున్న యాత్మయుఁ బొడొందు దేవ తి-
ర్యఙ్మనుష్యస్థావరాది వివిధ

3-948.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోనులను భిన్నభావంబు నొందుటయును
జాలఁ గల్గు నిజగుణ వైమ్యమునను
భిన్నుఁడై వెల్గుఁ గావున బేర్చి యదియు
దేహసంబంధి యగుచు వర్తించుచుండు.

టీకా:

వరుసన్ = క్రమముగ; అనన్య = అనితరము; భావంబునన్ = అని భావించుట; చేసి = వలన; భూత = భూతములు; ఆవళిన్ = సమస్తము; అందున్ = లోను; తత = వానిని; ఆత్మకత్వమున = తానేయనుభావమున; చూచున్ = దర్శించును; ఆత్మీయ = తన యొక్క; ఘనతర = అత్యధికమైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; ఉపాధానముల్ = దేహములు; అందున్ = అందు; తవిలి = వ్యక్తమగుచున్; ఇమ్ముల = మనోజ్ఞముగ; వెలుంగున్ = వెలిగెడి; ఇద్ధజ్యోతి = దివ్యజ్యోతి; ఏకము = ఒకటే; అయ్యున్ = అయినను; బహు = ఆనేక; భావంబులన్ = విధములుగ; తోచు = కనిపించును; ప్రకృతి = ప్రకృతి; గతుడు = లోనున్నవాడు; అగుచున్న = అవుతున్న; ఆత్మయున్ = తనను; పొగడొందు = ప్రసిద్దమగును; దేవ = దేవతలు; తిర్యక్ = జంతువులు; మనుష్య = మనుష్యులు; స్థావర = వృక్షములు; ఆది = మొదలగు; వివిధ = రకరకముల;
యోనులన్ = గర్భములలో; భిన్న = వేరవేరు; భావంబును = విధములు; ఒందుటయున్ = కలుగుటలు; చాలన్ = చాలా రకాలు; కల్గున్ = కలుగును; నిజ = తన; గుణ = గుణములలో; వైషమ్యమునను = బేధములతో; భిన్నుడు = వేరువేరుగ యైనవాడు; ఐ = అయ్యి; వెల్గున్ = ప్రకాశించును; కావునన్ = అందుచేత; అదియున్ = అదికూడ; దేహ = ఆయా దేహములకు; సంబంధి = సంబంధించినవి; అగుచున్ = అవుతూ; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; ఉండున్ = ఉండును.

భావము:

సర్వ భూతాలలోను అనన్య భావంతో, సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే.