పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

  •  
  •  
  •  

3-946.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మమున కాత్మ దాఁ బృథగ్భావ మగుచు
ద్రష్టయయి బ్రహ్మ సంజ్ఞచేఁ నరుచుండు
ఖిలభూరి ప్రపంచంబు లందుఁ దన్నుఁ
విలి తనయందు నఖిల భూములఁ గనుచు.

టీకా:

సుత = పుత్రులు; దార = భార్య; మిత్ర = స్నేహితులు; అనుజులు = సోదరులు; కంటెన్ = కంటెను; మర్త్యుండు = మానవుడు {మర్త్యుడు - మృత్యువు కలవాడు, మానవుడు}; భిన్నుడు = వేరైనవాడు; ఐ = అయ్యి; వర్తించుచున్న = ఉంటున్న; రీతిన్ = విధముగ; విస్పులింగ = అగ్నికణములు; ఉల్ముక = కొరివి, కాలుతున్న కఱ్ఱమంట; విపుల = విస్తృతమైన; ధూమముల్ = పొగల; చేన్ = నుండి; హవ్యవాహనుండు = అగ్నిదేవుడు; వేఱయిన = వేరుగ ఉండు; రీతిన్ = విధముగ; వలనొప్పన్ = పోలి ఉండెడి; దేహంబు = శరీరము; వలనన్ = నుండి; ఈ = ఈ; జీవాత్మ = జీవుడు; పరికింపన్ = తరచిచూసిన; భిన్న = వేరైన; రూపమున్ = స్వరూపమున; ఉండున్ = ఉండును; తవిలి = వ్యక్తమగుచున్; భూత = పంచభూతములు; ఇంద్రియ = దశేంద్రియములు; అంతఃకరణంబులన్ = అంతఃకరణచతుష్టయములతో; భాసిల్లుతున్న = ప్రకాశిస్తున్న; ఈ = ఈ; ప్రకృతి = ప్రాకృతిక; రూప = రూపము కల;
బ్రహ్మమున = పరమాత్మ; కున్ = కు; ఆత్మ = ఆత్మ; తాన్ = తాను; పృథక్ = వేరైన; భావము = భాగము; అగుచున్ = అవుతూ; ద్రష్ట = చూచువాడు, దర్శించువాడు; అయి = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మ; సంజ్ఞ = అను పేరు; చేన్ = తోటి; తనరుచున్ = అతిశయించి; ఉండున్ = ఉండును; అఖిల = సమస్తమైన; భూరి = అత్యధికమైన విధములగు; ప్రపంచంబుల్ = ప్రపంచముల; అందున్ = అందులోను; తన్నున్ = తనను; తవిలి = వ్యక్తముగుచున్; తన = తన; అందున్ = లో; అఖిల = సమస్తమైన; భూతములన్ = భూతములను; కనుచున్ = చూచుచున్.

భావము:

పుత్ర మిత్ర కళత్రాదులకంటె మానవుడు వేరైనట్లు, మిణుగురుల కంటే, కొరవుల కంటే, పొగ కంటే అగ్ని వేరైనట్లు దేహం కంటే జీవాత్మ వేరై ఉంటుంది. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణము, వీటితో భాసించే ఈ ప్రకృతి రూప పరమాత్మ కంటే ఆత్మ వేరుగా ఉంటుంది. ఆ ఆత్మ బ్రహ్మ సంజ్ఞతో ద్రష్టయై ఒప్పుతూ అఖిల భూతాలలో తననూ, తనలో అఖిల భూతాలను కనుగొంటుంది.