పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

  •  
  •  
  •  

3-944-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషుఁడు చరమమై భువి నన్య విషయ ని-
వృత్తమై తగ నివర్తించు చిత్త
వృత్తాదులను గల్గి వెలయంగ నాత్మీయ-
గు మహిమ సునిష్ఠుఁడై లభించు
సుఖదుఃఖముల మనస్సునఁ దలపక యహం-
కారధర్మంబులుగాఁ దలంచి
నయంబు సాక్షాత్కృతాత్మతత్త్వము గల్గు-
తఁడు జీవన్ముక్తుఁ డండ్రు ధీరు

3-944.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు నే చందమున నుండు నిన వినుము
శరీరంబు నిలుచుటయును జరించు
యును గూర్చుండుటయు నిఁకేమియు నెఱుంగ
ర్థి వర్తించు విను తల్లి! తఁడు మఱియు.

టీకా:

పురుషుడు = పురుషుడు; చరమమై = చిట్టచివరిదైనది; ఐ = అయ్యి; భువిన్ = లోకములో; అన్య = ఇతర; విషయ = విషయముల నుండి; నివృత్తము = మరల్చబడినది, విముఖమైనది; ఐ = అయ్యి; తగ = అవశ్యము; నివర్తించు = ప్రవర్తించు; చిత్తవృత్తి = చిత్తవృత్తి; ఆదులను = మొదలగువానిని; కలిగి = ఉండి; వెలయంగ = ప్రకాశించునట్లు; ఆత్మీయము = తనది; అగు = అయినట్టి; మహిమన్ = గొప్పదనముతో; సు = మంచి; నిష్ఠుడు = నిష్ఠకలవాడు; ఐ = అయ్యి; లభించు = కలిగెడి; సుఖ = సుఖమును; దుఃఖములన్ = దుఃఖములను; మనస్సునన్ = మనస్సులో; తలపక = లక్ష్యపెట్టక; అహంకార = అహంకారము యొక్క; ధర్మంబులు = ధర్మములు; కాన్ = అగునట్లు; తలంచి = తీసుకొని; అనయంబున్ = నిత్యము; సాక్షాత్కృత = సాక్షాత్కరించిన; ఆత్మతత్త్వము = ఆత్మతత్త్వము; కల్గున్ = కలుగునో; అతడున్ = అతనిని; జీవన్ముక్తుడు = జీవన్ముక్తుడు; అండ్రు = అనెదరు; ధీరులు = జ్ఞానులు; అతడున్ = అతడు; ఏ = ఏ; చందంబునన్ = విధముగా; ఉండున్ = ఉండును; అనినన్ = అనగా;
వినుము = వినుము; తన = తన యొక్క; శరీరంబు = దేహము; నిలుచుటయును = నిలుచుండుట; చరించుటయునున్ = తిరుగుట; కూర్చుంటయున్ = కూర్చొనుట; ఇఁకేమియున్ = ఇంకేమీకూడ; ఎఱుంగక = తెలియక; అర్థిన్ = కోరి; వర్తించున్ = నడచును; విను = వినుము; తల్లి = తల్లి; అతడున్ = అతడు; మఱియు = ఇంకను.

భావము:

ఏ పురుషుడు తన జీవితానికి అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాలనుండి నివృత్తమైన చిత్తంతో ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ కలవాడై సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టక అవి అహంకార ధర్మాలని గుర్తించి వర్తిస్తాడో ఆ పురుషునికి ఆత్మతత్త్వం సాక్షాత్కరిస్తుంది. అటువంటి వానినే జీవన్ముక్తుడని ప్రాజ్ఞులంటారు. అటువంటివాడు తన శరీరం నిలుచుండటం, కూర్చుండటం, తిరగడం మొదలైనవి ఏవీ తెలియకుండా ఉంటాడు. తల్లీ! ఇంకా విను.