పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

  •  
  •  
  •  

3-943-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది గావున; ముక్తి నపేక్షించు మహాత్ముం డగు వాని చిత్తంబు విముక్తం బైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు గలిగి విషయాంతర శూన్యంబై విరక్తిం బొందుటంజేసి పురుషుండు శరీరభావంబుల ననన్యభావం బగు నిర్వాణపదంబు సూక్ష్మం బగు తేజంబు దన కంటె నధింకబగు తేజంబు తోడి సమానాకారంబు నగు చందంబున నిచ్చగించు; వెండియు.

టీకా:

అదిగావునన్ = అందుచేత; ముక్తిన్ = ముక్తిని; అపేక్షించు = కోరు; మహాత్ముండు = గొప్పవాడు; అగు = అయిన; వాని = వాని; చిత్తంబున్ = మనస్సు; విముక్తంబున్ = విడిచిపెట్టేసినవి; ఐన = అయిన; భగవత్ = భగవంతుని యొక్క; వ్యతిరిక్త = వ్యతిరేకమును; ఆశ్రయంబున్ = ఆశ్రయమును; కలిగి = కలిగి; విషయ = లక్ష్యములు; అంతర = ఇతరమైనవి; శూన్యంబున్ = లేనివి; ఐ = అయ్యి; విరక్తిన్ = వైరాగ్యమును; పొందుటన్ = పొందుట; చేసి = వలన; పురుషుండు = పురుషుడు; శరీర = దేహమందలి; భావంబులన్ = ఆలోచనలలో; అనన్య = ఇతరము లేని; భావంబున్ = భావము; అగు = కలుగును; నిర్వాణపదంబున్ = ముక్తిపదము; సూక్ష్మంబు = చిన్నది; అగు = అయిన; తేజంబున్ = వెలుగు; తన = తన; కంటెన్ = కంటెను; అధికంబున్ = పెద్దది; అగు = అయిన; తేజంబున్ = వెలుగు; తోడి = తోటి; సమానాకారంబున్ = సమానమైన ఆకారముగన్; అగు = అగు; చందంబునన్ = విధముగనే; ఇచ్ఛగించు = ఇష్టపడును; వెండియున్ = మరియును.

భావము:

అందువల్ల మోక్షాన్ని అపేక్షించే మహానుభావుని మనస్సు సంసార బంధాలనుండి విముక్తమవుతుంది. దానిలో భగవంతునికంటె వ్యతిరిక్తమైన భాగానికి తావు లేదు. భగవంతునికంటె అన్యం కన్పించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల పురుషునకు అనన్యస్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకంటే పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే విధంగా జీవుడు తన శరీరం, మనస్సు మొదలైన వానియందు వేరే భావన లేక సర్వం భగవన్మయంగా సంభావిస్తాడు. ఆ అనన్యభావమే మోక్షం.