పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

  •  
  •  
  •  

3-942.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుమహితధ్యానమునఁ బరంజ్యోతి యందు
నముఁ జాల నియోజించి హిమఁ దనరు
మోక్షపద మాత్మలోన నపేక్షసేయు
నఘవర్తనుఁ డైన మహాత్ముఁ డెపుడు.

టీకా:

ఈ = ఈ; ప్రకారమునన్ = విధముగ; సర్వేశ్వరున్ = విష్ణుమూర్తి; అందున్ = అందు; ప్రతి = చక్కగ; లబ్ధ = కలిగిన; భావ = భావములతో; సంపన్నుండు = సంపద కలవాడు; అగుచున్ = అవుతూ; చిరతర = మిక్కిలిబహుకాలపు; సత్ = మంచి; భక్తి = భక్తి; చేన్ = చేత; ప్ర = మిక్కిలి; వృద్ధంబు = వృద్ధి చెందినది; ఐన = అయిన; ఆతి = మిక్కిలి; మోదమునన్ = సంతోషముతో; పులకిత = పులకిస్తున్న; శరీరుడు = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ; మహా = గొప్ప; ఉత్కంఠ = ఆసక్తి; ఆనంద = ఆనంద ములతో కూడిన; భాష్పముల్ = కన్నీరు; జడిగొనన్ = వర్షించగా; పరితోష = సంతోషము అనెడి; జలధిన్ = సముద్రములో; క్రుంకి = మునిగి; భగవత్ = భగవంతుని యొక్క; స్వరూపము = స్వరూపము; ఐ = అయ్యి; భవ = సంసారము యొక్క; గుణ = గుణములను; గ్రాహకము = గ్రహించివేయునది, మొసలి; అగుచున్ = అవుతూ; మత్ = నాతో; సంబంధమున్ = సంబంధమును, కూడుటను; అనుకరించి = అనుసరించి;
సు = మంచి; మహిత = మహిమాన్వితమైన; ధ్యానమునన్ = ధ్యానమును; పరంజ్యోతి = విష్ణుమూర్తి {పరంజ్యోతి - అన్నిటికిని అతీతమైన ప్రకాశము, విష్ణువు}; అందున్ = అందు; మనమున్ = మనస్సును; చాలన్ = మిక్కిలిగా; నియోగించి = అప్పచెప్పి, పనిపి; మహిమన్ = గొప్పదనముతో; తనరున్ = అతిశయించు; మోక్షపదమున్ = మోక్షప్రాప్తిని; ఆత్మన్ = మనస్సు; లోనన్ = లో; అపేక్షసేయున్ = కోరును; అనఘు = పుణ్యమైన; వర్తనుడు = ప్రవర్తన కలవాడు; ఐన = అయిన; మహాత్ముడు = గొప్పవాడు; ఎపుడున్ = ఎప్పుడును.

భావము:

ఈవిధంగా నిష్కళంకజీవనుడైన మహాత్ముడు సర్వేశ్వరునిపై నిలిపిన భావసంపద కలవాడై సమధిక సద్భక్తితో మిక్కిలి మోదంతో పులకించిన శరీరం కలవాడై ఎంతో కుతూహలంతో సంతోషబాష్పాలు పొంగిపొరలగా ఆనందం అనే సముద్రంలో మునిగి విషయ బంధాల నుండి విముక్తి కలిగించే నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకొని ఉత్తమ ధ్యానంతో అన్నింటిని మించిన వెలుగునందు మనస్సును నిల్పగలుగుతాడు. హృదయ పూర్వకంగా మోక్షాన్ని అపేక్షిస్తాడు.