పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-941.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ
సంచితధ్యాన నిర్మల స్థానములుగ
నములోఁ గను" మని చెప్పి ఱియుఁ బలికె
దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.

టీకా:

మునుల్ = మునుల; కున్ = కు; మకరకేతనున్ = మన్మథుని {మకరకేతనుడు - మకరము (మొసలి) కేతనము గుర్తుకల జండా కలవాడు, మన్మథుడు}; కున్ = కును; మోహనంబున్ = మోహము పుట్టించునది; ఐన = అయిన; స్వకీయ = స్వంత; మాయా = మాయ యొక్క; విలాసమున = విలాసముతో; రచితంబు = కల్పింపబడినది; ఐన = అయిన; భ్రూ = కనుబొమల; మండలంబునున్ = ప్రదేశమున; ముని = మునుల; మనస్ = మనస్సులను; కుహర = గుహలకు; సమ్మోదమానుడు = సంతోషమును కలిగించువాడు; అగు = అయిన; ఈశ్వరుని = భగవంతుని; మందహాసనంబునన్ = చిరునవ్వునందలి; నవ = లేత; పల్లవ = చిగురు వంటి; అధర = పెదవి యొక్క; కాంతిన్ = కాంతి; చేన్ = చేత; అరుణమైన = ఎఱ్ఱబడిన; మొల్ల = మల్లె; మొగ్గల = మొగ్గల యొక్క; కాంతిన్ = కాంతితో; ఉల్లసంబాడెడు = ఉల్లసిల్లు; దంత = పళ్ళ; పంక్తిన్ = వరుసను; మదిన్ = మనస్సున; తలంపన్ = స్మరింప; వలయు = వలెను;
వెలయన్ = ప్రసన్నతతో; ఈరీతిన్ = ఈ విధముగా; అన్నియున్ = అన్నిటిని; వేఱువేఱ = వేరువేరుగ; సంచిత = కూడిన; ధ్యాన = ధ్యానించుటకు; నిర్మల = స్వచ్ఛమైన; స్థానములుగ = సంగతులుగ; మనము = మనస్సు; లోన్ = లోపల; కనుము = చూడుము; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = మరల; పలికెన్ = పలికెను; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; కపిలుండు = కపిలుడు; తేటపడగన్ = తేటతెల్లమగునట్లు.

భావము:

మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి” అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్ళీ ఇలా అన్నాడు.