పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-939-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుచిగల మందస్మిత
ము కనుగుణ మగు ప్రసాదమును జిత్తమునన్
మునుకొని ధ్యానముసేయం
ను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ!

టీకా:

ఘన = దట్టమైన; రుచి = కాంతి; కల = కలిగిన; మంద = మెల్లని; స్మితమున్ = చిరునవ్వున; కున్ = కు; అనుగుణము = కూడి ఉండునట్టిది; అగు = అయిన; ప్రసాదమును = అనుగ్రహమును; చిత్తమునన్ = మనస్సులో; మునుకొని = పూని; ధ్యానము = ధ్యానము; చేయంజను = చేయవలెను; యోగి = యోగులైన; జన = జనముల; ఆవళి = సమూహమున; కున్ = కు; ఎపుడన్ = ఎల్లప్పుడును; సౌజన్యనిధీ = తల్లీ {సౌజన్యనిధి - సౌజన్యము (మంచితనము) నకు నిధి వంటిది}.

భావము:

సౌజన్యానికి నిధి వంటి ఓ తల్లీ! భక్తియోగాన్ని అవలంబించినవారు కమనీయకాంతులు ప్రసరించే విష్ణువుయొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను మలినం లేని మనస్సులో మాటిమాటికి మననం చేసుకోవాలి.