పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-936-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందరగిరి పరివ
ర్త నికషోజ్జ్వలిత కనకత్నాంగదముల్
రార లోకపాలకు
ను గలిగిన బాహు శాఖను దలఁపఁదగున్.

టీకా:

ఘన = గొప్పదియైన; మందర = మందరము అనెడి; గిరి = పర్వతము; పరి = వద్ద; వర్తన = తిరుగుతుండుటచే; నికష = సానపెట్టబడి; ఉజ్జ్వలిత = మెరుస్తున్న; కనక = బంగారు; రత్న = రత్నములు పొదిగిన; అంగదముల్ = నగలతో; తనరారన్ = అతిశయిస్తున్నట్టి; లోకపాలకులనున్ = లోకపాలకులను; కలిగిన = మోసెడి, కాపాడెడి; బాహు = చేతులు అనెడి; శాఖలను = కొమ్మలను; తలంపగన్ = సంస్మరించుట; తగున్ = చేయవలయును.

భావము:

సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మెఱుగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగిన లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి.