పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-935-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితంబున్ భజియించు సజ్జన మనోనేత్రాభిరామైక సు
స్థి దివ్యప్రభ గల్గు కౌస్తుభరుచిశ్లిష్టంబునై యొప్పు నా
యోగీశ్వరవంద్యమానుఁ డగు సర్వస్వామి లక్ష్మీశు కం
మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబుసేయం దగున్.

టీకా:

నిరతంబున్ = ఎల్లప్పుడును; భజియించు = సేవించు; సత్ = మంచి; జన = జనముల; మనస్ = మనస్సు నందలి; నేత్ర = కంటికి; అభిరామ = ఒప్పిదమై; ఏక = అసహాయ; సుస్థిర = శాశ్వత; కౌస్తుభ = కౌస్తుభమణి; రుచిన్ = కాంతులు; శ్లిష్టంబున్ = పరచుకొన్నది; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ; వర = ఉత్తమ; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులచే; వంద్యమానుండు = నమస్కరింపబడువాడు; అగు = అయిన; సర్వస్వామి = విష్ణుమూర్తి యొక్క {సర్వ స్వామి - అందరకును స్వామి (ప్రభువు), విష్ణువు}; లక్ష్మీశు = విష్ణుమూర్తి యొక్క {లక్ష్మీశుడు - లక్ష్మీదేవికి ఈశుడు (భర్త), విష్ణువు}; కంధరమున్ = మెడను; ఆత్మన్ = మనస్సులో; కదియించి = హత్తుకొని; తత్ = అతని; గుణ = గుణములను; ధ్యానంబున్ = ధ్యానము; చేయన్ = చేయుట; తగున్ = చేయవలసినది.

భావము:

యోగీశ్వరులచే నమస్కారాలు అందుకునేవాడూ, అందరికీ ప్రభువూ, లక్ష్మీపతీ అయిన ఆ మహావిష్ణువు యొక్క మెడ; నిత్యం కొలిచే సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలు పంచేటటువంటిదీ, అద్భుతమైన కౌస్తుభమణికాంతులలో తేలియాడేదీనూ. అట్టి ఆ విష్ణుమూర్తి మెడను మనసులో నిలుపుకుని దాని గుణాలను ధ్యానం చేయాలి.