పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-933-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను భువనాధారత్వం
బునఁదగి విధిజననహేతుభూతంబగున
వ్వజాతముచేఁగడుమిం
చి హరినాభీసరస్సుఁజింతింపఁదగున్

టీకా:

విను = వినుము; భువన = లోకములకు; ఆధారత్వంబునన్ = ఆధారముగ నుండకలుగుటకు; తగి = చాలి ఉండు; విధి = బ్రహ్మదేవుని {విధి - పుట్టువులకు విధించు వాడు, బ్రహ్మదేవుడు}; జనన = పుట్టుకకు; హేతుభూతంబున్ = కారణాంశము; అగున్ = అయిన; ఆ = ఆ; వనజాతము = పద్మము {వనజాతము - వనము (నీరు) అందు పుట్టినది, పద్మము}; చేన్ = చేత; కడు = మిక్కిలి; మించిన = అతిశయించిన; హరి = విష్ణుమూర్తి యొక్క; నాభీ = బొడ్డు అనెడి; సరస్సున్ = సరస్సును; చింతింపన్ = స్మరించుట; తగున్ = చేయవలసినది.

భావము:

ఇంకా విను. అఖిల లోకాలకు ఆధారభూతమై, బ్రహ్మపుట్టుకకు హేతుభూతమైన పద్మంతో విరాజిల్లే సరోవరం వంటి విష్ణుమూర్తి నాభీమండలాన్ని సంస్మరించాలి.