పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-932-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిలంబిత మృదుపీతాం
కాంచీగుణ నినాదరితం బగున
ప్పురుషోత్తముని నితంబముఁ
రుణీ! భజియింపవలయు ద్దయుఁ బ్రీతిన్

టీకా:

పరి = చుట్టును; లంబిత = చుట్టబడిన; మృదు = మృదువైన; పీతాంబర = పట్టువస్త్రములు; కాంచీగుణ = మొలతాడు; నినాద = శబ్దములుతో; భరితంబు = కూడినది; అగు = అయిన; ఆ = ఆ; పురుషోత్తముని = విష్ణుమూర్తి యొక్క; నితంబమున్ = కటిప్రదేశమును; తరుణీ = తల్లీ {తరుణి - తరణ వయస్సున ఉన్నామె, స్త్రీ}; భజియింపన్ = కొలువ; వలయున్ = వలెను; దద్దయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగ.

భావము:

అమ్మా! ఒయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టుపీతాంబరం కట్టుకొని మొలనూలు మువ్వల సవ్వడి నివ్వటిల్లే పురుషోత్తముని కటిప్రదేశాన్ని భక్తితో భజించాలి.