పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-172-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శౌరియు నతిరథవరులు మ
హాథ సమరథులు యదుబలాధిపు లెల్లం
బోరిఁ మృతిఁబొంద నుద్ధవుఁ
డేరీతిన్ బ్రతికె నాకు నెఱిగింపు తగన్."

టీకా:

శౌరియున్ = కృష్ణుడును; అతిరథ = అతిరథులలో; వరులు = శ్రేష్ఠులు; మహారథులు = మహారథులు; సమరథులు = సమరథులు; యదు = యాదవ; బల = బలములో; అధిపులు = గొప్పవారు; ఎల్లన్ = అందరూ; పోరిన్ = పోరులో; మృతిన్ = మరణమును; పొందన్ = పొందగా; ఉద్ధవుడు = ఉద్ధవుడు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; బ్రతికెన్ = బతికెను; నాకున్ = నాకును; ఎఱిగింపు = తెలియజేయుము; తగన్ = శీఘ్రముగ.

భావము:

శ్రీకృష్ణుడు అవతారం చాలించగా, అతిరథ మహారథ సమరథులు అయిన యాదవ వీరు లందరూ తమలో తాము పోరాడుకొని ప్రాణాలు గోల్పోగా, అందరూ చనిపోగా, ఉద్ధవుడు మాత్రం ఎలా బ్రతుక గలిగాడు ఈ విషయం నాకు వివరించండి.”