పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-171-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లుద్ధవుండు యమునానది నుత్తరించి బదరికాశ్రమంబునకుం జనియె" ననిన విని రాజేంద్రుండు యోగీంద్రున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; ఉద్ధవుండు = ఉద్ధవుడు; యమునా = యమున అను; నదిని = నదిని; ఉత్తరించి = దాటి; బదరిక = బదరిక అను {బదరి - రేగుచెట్టు}; ఆశ్రమమున = అశ్రమమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అనిన = అనగా; విని = విని; రాజ = రాజులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఉద్ధవుడు యమునానది దాటి బదరికాశ్రమానికి వెళ్ళాడు” అని చెప్పగా విని రాజశ్రేష్ఠుడైన పరీక్షితుడు యోగిశ్రేష్ఠుడైన శ్రీశుకునితో ఇలా అన్నాడు.