పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-170-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱునాఁడు రేపకడ భా
సుపుణ్యుఁడు ఘనుడు మధునిషూదనచరణ
స్మణక్రీడాకలితుఁడు
రియించెం గలుషగహనహనన్ యమునన్.

టీకా:

మఱునాడు = తరువాతి రోజు; రేపకడ = ప్రాభాత కాలమున; భాసుర = ప్రకాశించుచున్; పుణ్యుడు = పుణ్యము కలవాడు; ఘనుడు = గొప్పవాడు; మధునిషూదనుడు = కృష్ణుని {మధునిషూదనుడు - మధు అను రాక్షసుని నిషూద (సంహరించి)నవాడు, విష్ణువు}; చరణ = పాదములను; స్మరణ = ధ్యానించుట అను; క్రీడా = క్రీడతో; కలితుడు = కలసి ఉన్నవాడు; తరియించెన్ = దాటెను; కలుష = పాపములు అను; గహన = అడవులను; దహనన్ = దహించుదానిని; యమునన్ = యమునానదిని.

భావము:

మర్నాడు ఉదయాన్నే మధుసూదనుని పదచింతన సంతోష తరంగాలలో ఓలలాడే అంతరంగం గల పుణ్యమూర్తి ఉద్ధవుడు పాపాలను రూపుమాపే యమునాతరంగిణిని దాటాడు.