పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-169-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని డాయనేఁగి మోదం
బునఁ దత్సరిదమల పులిన భూములఁ దగ నా
దిశేషము నివసించెను
జోదరపాదపద్మశమానసుఁడై

టీకా:

కని = చూసి; డాయన్ = డగ్గరకు; ఏగి = వెళ్ళి; మోదంబునన్ = సంతోషముతో; తత్ = ఆ; సరిత్ = నది యొక్క; అమల = నిర్మలమైన; పులినభూములన్ = ఇసకతిన్నెలందు; తగన్ = అలా; ఆ = ఆ; దినశేషము = రాత్రి {దినశేషము - ఆనాటికి మిగిలిన సమయము, రాత్రి}; నివసించెను = ఉండెను; వనజోదర = కృష్ణుని {వనజోదరుడు - వనము (నీటి)లో జ (పుట్టిన) (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; పాద = పాదములు అను; పద్మ = పద్మములకు; వశ = వశమైన; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయి.

భావము:

అలా దర్శనమిచ్చిన యమునా నదిని విదురుడు ఉద్ధవుడు సమీపించారు. విదురుడు ఆ నదిలోని అందమైన తెల్లని ఇసుక తిన్నెల మీద ఆనందంగా ఆసీనుడైనాడు. పద్మోదరుడైన ఆ శ్రీకృష్ణుని పాదపద్మాల స్మరణ యందు లగ్మమైన మనస్సు కలవాడై ఆ దినమంతా గడిపాడు.