పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-168-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముంటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు హల్లకఫుల్లపద్మ ని
ష్యం మరందపాన విలన్మద భృంగ జలత్తరంగ మా
కం లవంగ లుంగ లతికాచయ సంగ సురాంగనాశ్రితా
నందితపుణ్యసంగ యమునన్ భవభంగ శుభాంగ నర్మిలిన్.

టీకా:

ముందటన్ = ఎదురుగా; కాంచెన్ = చూసెను; అంత = అంతట; బుధ = జ్ఞానులలో; ముఖ్యుడు = శ్రేష్ఠుడు; హల్లక = చెంగలువ; పుల్లపద్మ = వికసించిన పద్మములనుండి; నిష్యంద = స్రవించుచున్న; మరంద = తేనె; పాన = తాగి; విలసత్ = శోభిల్లుతూ; మద = పరవశించిన; భృంగ = తుమ్మెదలు; చలత్ = కదులుతున్న; తరంగ = అలలు; మాకంద = మామిడి; లవంగ = లవంగ; లుంగ = మాదీఫల; లతికా = లతల; చయ = గుంపుని; సంగ = కలిసి ఉన్న; సుర = దేవతా; అంగనా = స్త్రీలచే; ఆశ్రిత = ఆశ్రయింపబడిన; ఆనందిత = ఆనందము గలిగింపబడిన; పుణ్య = పుణ్యము; సంగ = అంటినది; యమునన్ = యమునానదిని; భవ = సంసారబంధములను; భంగ = తెంపునది; శుభ = శోభనకరమైన; అంగన్ = దేహము కలదానిని; నర్మిలిన్ = ఆపేక్షగా.

భావము:

అలా వెళుతున్న విదుర ఉద్ధవులకు ఎదురుగుండా యమునానది కన్పించింది. ఆ నదిలో కలువపూలు, తామరవూలూ వికసించి ఉన్నాయి. ఆ పూలలో చిందే మకరంద బిందువులను కమ్మగా కడుపునిండా త్రాగిన తుమ్మెదలు మైమరచి విహరిస్తున్నాయి. నదిలో తరంగాలు కదలాడుతున్నాయి. ఆ నది ఒడ్డున మామిడిచెట్లూ, లవంగ లతలూ, మాదీఫల వృక్షాలూ చిక్కగా క్రిక్కిరిసి ఉన్నాయి. ఆ పొదరిండ్లలో సురసుందరులు చరిస్తున్నారు. సంసార బంధాలను పోకార్చి పుణ్యాన్ని చేకూర్చే సుగుణాల దొంతి అయిన ఆ యమునా స్రవంతి కన్నుల విందుగా కానవచ్చింది.