పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-166-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి మురభేది పరాపరుఁ
రుణాకరుఁ దలఁచు నట్టి నుఁ డమ్మునికుం
రు కడకేఁగిన నాతడు
మర్థిం దెలుపు సాత్విజ్ఞానంబున్."

టీకా:

హరిన్ = కృష్ణుని {హరిన్ - పాపములను హరించు వాడు, విష్ణువు}; మురభేధిన్ = కృష్ణుని {మురభేది - మురాసురుని భేదించిన వాడు, విష్ణువు}; పరాపరున్ = కృష్ణుని {పరాపరుడు - స్థూల (పరము) సూక్ష్మము (అపరము)లు తానైనవాడు, విష్ణువు}; కరుణాకరున్ = కృష్ణుని {రుణాకరుడు - దయకు ఆకరుడు (నివాసము)యైనవాడు, విష్ణువు}; తలచున్ = ధ్యానించున; అట్టి = అట్టి; ఘనుడు = గొప్పవారు; ఆ = ఆ; ముని = మునులలో; కుంజరు = శ్రేష్ఠుని; కడ = దగ్గర; కున్ = కు; ఏగిన = వెళ్ళిన; ఆతడు = అతడు; కరము = మిక్కిలి; అర్థిన్ = కుతూహలముతో; తెలుపు = తెలియజేయును; సాత్విక = సాత్వికమైన; జ్ఞానంబునన్ = జ్ఞానమును.

భావము:

ఆ మహానుభావుడు మైత్రేయుడు ఆ మురహరుని, ఆ పరాత్పరుని, ఆ కరుణాకరుని స్మరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆయన సన్నిధికి వెళ్తే తప్పకుండా ఆ మహాముని నీకు అత్యంత ప్రీతితో ఆధ్యాత్మిక తత్త్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.”