పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-165-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడు నుద్ధవుఁ డవ్విదు
రు కిట్లను "ననఘ! మునివరుఁడు సాక్షాద్వి
ష్ణునిభుండగు మైత్రేయుఁడు
మనమున మనుజగతి వలఁ దలఁచి తగన్.

టీకా:

అనవుడు = అనగా; ఉద్ధవుడు = ఉద్ధవుడు; ఆ = ఆ; విదురున = విదురున; కున్ = కు; ఇట్లు = ఈవిధముగ; అనున్ = అనెను; అనఘా = పుణ్యాత్ముడా; ముని = మునులలో; వరుడు = శ్రేష్ఠుడు; సాక్షాత్ = సాక్షాత్తు; విష్ణు = విష్ణువునకు; నిభుండు = సమానుడు; అగు = అయిన; మైత్రేయుడు = మైత్రేయుడు; తన = తన; మనమునన్ = మనసులో; మనుజ = మానవ; గతిన్ = స్థితిన్, జన్మమును; వదలన్ = వదలాలని; తలచి = తలచి; తగన్ = శీఘ్రముగ.

భావము:

ఆ మాటలు విని ఉద్ధవుడు విదరునితో ఇలా అన్నాడు. “వినవయ్యా! విదురా! సంయమివరేణ్యుడూ, సాక్షాత్తూ విష్ణువుతో సమానుడూ అయిన మైత్రేయుడు తన మనుష్యదేహాన్ని వదిలిపెట్టడానికి మనస్సులో నిశ్చయించుకున్నాడు.