పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-918.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిజపరిజ్ఞాన విచ్ఛిన్ననిఖిలసంశ
యుండు నిర్ముక్తలింగదేహుండు నగుచు
నఘ! యోగీంద్రహృద్గేయ గు మదీయ
దివ్యధామంబు నొందు సందీప్తుఁ డగుచు.

టీకా:

అధి = అధిష్టించిన; ఆత్మ = ఆత్మకలిగి అందు; తత్తపరుండు = లగ్నమైన వాడు; అగు = అయిన; వాడు = వాడు; పెక్కు = అనేక; జన్మంబులన్ = జన్మములందు; పెక్కు = అనేక; కాలంబులు = సమయములు; అందున్ = లో; బ్రహ్మ = సృష్టికర్త; పద = పదవి; ప్రాప్తిన్ = పొందు; పర్యంతమునున్ = వరకును; పుట్టున్ = పుడుతుండును; సర్వ = సమస్తమైన; అర్థ = ప్రయోజనముల ఎడల; వైరాగ్య = విరక్తి; శాలి = కలవాడు; అగుచున్ = అవుతూ; పూని = పూని; నా = నా యొక్క; భక్తుల్ = భక్తులు; చేన్ = చేత; ఉపదేశింపబడిన = ఉపదేశింపబడినట్టి; విజ్ఞాన = విజ్ఞానము అనెడి; సంపత్తి = సంపద; చేన్ = చేత; పరగన్ = ప్రయుక్తముచే; ప్రబుద్ధుడు = మేలుకొన్నవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; వారములున్ = మార్లు; భూరి = అత్యథికమైన; మత్ = నా యొక్క; ప్రసాద = అనుగ్రహమును; ప్రాప్తిన్ = పొందు; మతిన్ = సంకల్పముతో; తనర్చు = అతిశయించును;
నిజ = తనచే; పరిజ్ఞాన = సంపాదించిన చక్కటి జ్ఞానము వలన; విచ్చిన్న = తెగిపోయిన; నిఖిల = సమస్తమైన; సంశయుండు = సంశయములు కలవాడును; నిర్ముక్త = తొలగిన; లింగదేహుండున్ = లింగదేహము కలవాడు {లింగదేహము - తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; అగుచున్ = అవుతూ; అనఘ = పుణ్యురాల; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; హృత్ = హృదయమున; గేయము = కీర్తింపబడునది; అగు = అయిన; మదీయ = నా యొక్క; దివ్య = దివ్యమైన; ధామంబున్ = ధామమును; ఒందు = పొందు; సందీప్తుడు = చక్కగ ప్రకాశమును పొందినవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

"పుణ్యాత్మురాలా! ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపదవల్ల ప్రబోధం పొందినవాడై ఎన్నో మారులు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహా లన్నింటినీ పోగొట్టుకుంటాడు. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగిపుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వియై చేరుకొంటాడు.