పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-913-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విమలాత్మ యీ పృథివికిని గంధమునకు-
లిలంబునకును రసంబునకును
న్యోన్య మగు నవినాభావసంబంధ-
మైన సంగతిఁ బ్రకృత్యాత్మలకును
తతంబు నన్యోన్య సంబంధమై యుండు-
ప్రకృతి దా నయ్యాత్మఁ బాయు టెట్లు
లపోయ నొకమాటు త్త్వబోధముచేత-
వభయంబుల నెల్లఁ బాయు టెట్లు

3-913.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చి క్రమ్మఱఁ బుట్టని జాడ యేది
యిన్నియుఁ దెలియ నానతి యిచ్చి నన్నుఁ
రుణ రక్షింపవే దేవణసుసేవ్య!
క్తలోకానుగంతవ్య! రమపురుష!"

టీకా:

విమలాత్మ = స్వచ్ఛమైన మనసు కకలవాడ; ఈ = ఈ; పృథివి = మన్ను; కిని = కిని; గంధమున్ = వాసన; కున్ = కు; సలిలంబున్ = జలమున; కును = కును; రసంబున్ = రుచి; కును = కిని; అన్యోన్య = ఒకదానికోటి; అగు = అయిన; అవినాభవ = విడదీయలేని; సంబంధము = సంబంధము; ఐన = ఉన్నట్టి; సంగతిన్ = విధముగనె; ప్రకృతి = ప్రకృతి; ఆత్మలన్ = ఆత్మల; కున్ = కు; సతతంబున్ = ఎల్లప్పుడు; అన్యోన్య = అన్యోన్య; సంబంధము = సంబంధము; ఐ = కలిగి; ఉండున్ = ఉండును; ప్రకృతి = ప్రకృతి; తాన్ = తను; అయ్యున్ = అయినప్పటికిని; ఆత్మన్ = ఆత్మను; పాయుటన్ = విడిచిపెట్టుట; ఎట్లు = ఎటుల అగును; తలపోయన్ = తరచిచూసిన; ఒకమాటు = ఒకసారి కలిగిన; తత్త్వబోధమున్ = తత్త్వజ్ఞానము; చేతన్ = వలన; భవభయంబుల్ = జన్మాది సంసార భయములు; ఎల్లన్ = అన్నిటిని; పాయుటన్ = తొలగిపోవుట; ఎట్లు = ఏలాగ అగును;
చచ్చి = మరణించి; క్రమ్మఱ = మరల; పుట్టని = పుట్టుక లేకుండ ఉండే; జాడ = మార్గము; ఏది = ఏది; ఇన్నియున్ = ఇవన్నీ; తెలియన్ = తెలియునట్లు; ఆనతిన్ = సెలవు; ఇచ్చి = ఇచ్చి; నన్నున్ = నన్ను; కరుణన్ = దయతో; రక్షింపవే = కాపాడుము; దేవ = దేవతా; గణ = సమూహముచే; సుసేవ్య = చక్కగ కొలువబడువాడ; భక్త = భక్తులైన; లోకన్ = జనులకు; అనుగంతవ్య = గమ్యమైన వాడ; పరమ = పరమమైన; పురుష = పురుషుడ.

భావము:

“పుణ్యాత్మా! పంచభూతాలలో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడు పరస్పర సంబంధం ఉంది కదా! అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచి పెట్టగలుగుతుంది? ఒక్కసారి కలిగిన తత్త్వజ్ఞానంవల్ల సంసారభయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఏది? ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. దేవతలచే సేవింపబడేవాడా! భక్తజన శరణ్యా! పరమపురుషా! దయతో ఈ జ్ఞానం నాకు కటాక్షించు. నన్ను రక్షించు.”