పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-911.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చు నాత్మస్వరూపంబు లఁతిగాఁగ
జిత్తమునఁ దోచు నంచితశ్రీఁ దనర్చి
మ్మహామూర్తి సర్వభూతాంతరాత్ముఁ
గుచు నాత్మజ్ఞులకుఁ గానగును మఱియు.

టీకా:

వినుము = వినుము; ఆత్మ = ఆత్మ యొక్క; వేత్త = స్వరూపము తెలిసినవాని; కున్ = కి; విష్ణు = విష్ణుమూర్తి; స్వరూపంబున్ = స్వరూపము; ఎఱుగంగనబడును = తెలిసికొనబడును; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అట = అటుల; అన్న = అనిన; గగనస్థుడు = ఆకాశమున ఉన్నవాడు; అగు = అయిన; దినకరు = సూర్యుని; కిరణ = వెలుగు; ఛాయన్ = నీడలను; జలములన్ = నీటియందు; గృహ = ఇంటి; కుడ్య = గోడల; జాతములన్ = సమూహములు; వలనన్ = వలన; తోచిన = తెలిసికొనబడిన; ప్రతిఫలితంబు = ప్రతిబింబము; చేతన్ = వలన; ఊహింపబగడిన = ఊహంచుకొన్న; ఆ = ఆ; ఇనుని = సూర్యుని; పగిదిన్ = వలె; అర్థిన్ = కోరి; మనస్ = మనసు; బుద్ధి = బుద్ధి; అహంకరణ = అహంకారముల; త్రయ = మూడు; నాడీ = నాడుల; ప్రకాశముననున్ = ప్రకాశమున; ఎఱుంగన్ = తెలియ;
వచ్చున్ = వచ్చును; ఆత్మ = ఆత్మ యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; వలతి = సమర్థుడు; కాగ = అయ్యి; చిత్తమునన్ = మనసున; తోచున్ = తోచును; అంచిత = ప్రకాశించు; శ్రీన్ = శోభ వలన; తనర్చి = అతిశయించి; ఆ = ఆ; మహామూర్తి = గొప్పవాడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులకును; అంతరాత్ముడు = అంతర్యామి; అగుచున్ = అవుతూ; కాననగును = చూడగలుగుతాడు; మఱియున్ = ఇంకను.

భావము:

“అమ్మా! విను. ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్ళలోనూ, ఇంటిగోడలలోని కిటికీసందులలోను ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా...