పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

 •  
 •  
 •  

3-909-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రద్ధాగరిష్ఠుఁడై త్య మైనట్టి మ-
ద్భావంబు మత్పాద సేనంబు
ర్ణిత మత్కథార్ణనంబును సర్వ-
భూ సమత్వమజావైర
మును బ్రహ్మచర్యంబు మౌనమాదిగా-
ల నిజ ధర్మసంతులఁ జేసి
సంతుష్టుఁడును మితానుఁడు నేకాంతియు-
ననశీలుఁడు వీత త్సరుండు

3-909.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గుచు మిత్రత్వమున గృపఁ గిలి యాత్మ
లిత విజ్ఞాని యై బంధకంబు లైన
న శరీర పరిగ్రహోత్కంఠ యందు
నాగ్రహము వాసి వర్తింప గును మఱియు.

టీకా:

శ్రద్ధా = శ్రద్ధ కలిగి ఉండుటలో; గరిష్ఠుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; సత్యము = నిజము; ఐనట్టి = అయినట్టి; మత్ = నా గురించిన; భావంబున్ = ఆలోచనలను; మత్ = నన్ను; సేవనంబున్ = కొలచుటయును; వర్ణిత = కీర్తింపబడిన; మత్ = నా యక్క; కథా = కథలను; ఆకర్ణనమున్ = వినుటయును; సర్వ = సమస్తమైన; భూత = జీవుల ఎడ; సమత్వమున్ = సమత్వమును; అజాత = పుట్టని; వైరమునున్ = శత్రుత్వమును; బ్రహ్మచర్యంబున్ = బ్రహ్మచర్యమును; ఘన = గొప్ప; మౌనమున్ = మౌనమును; ఆదిగాన్ = మొదలైనవిగా; కల = ఉన్నట్టి; నిజ = తన; ధర్మ = ధర్మమున; సంగతులు = కూడి ఉండుటలును; చేసి = వలన; సంతుష్టుండును = సంతోషముగ ఉండువాడును; మిత = మితముగ; అశనుండును = భుజించువాడును; ఏకాంతియున్ = ఏకాంతమున ఉండువాడును; మనన = మననము చేయికొను; శీలుండును = వర్తనకలవాడును; వీత = వీడిన; మత్సరుండును = మాత్సర్యము కలవాడును; అగుచున్ = అవుతూ;
మిత్రత్వమునన్ = మైత్రితో; కృపన్ = దయతో; తగిలి = కూడి; ఆత్మన్ = స్వయముగ; కలిత = పొందిన; విజ్ఞాని = మంచి జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; బంధకంబులు = బంధనములు; ఐన = అయిన; ఘన = మిక్కిలిదైన; శరీర = దేహమును; పరిగ్రహ = భార్యాదుల ఎడ; ఉత్కంఠ = ఆతృత; అందున్ = దానిలోను; ఆగ్రహమున్ = ఆసక్తియును; వాసి = విడిచిపెట్టి; వర్తింపన్ = ప్రవర్తించుట; అగును = చేయదగును; మఱియున్ = ఇంకను.

భావము:

చలించని శ్రద్ధాసక్తులతో నాయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోను వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైనవారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువు లవుతాయి. ఇంకా...