పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-906-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూని చరించుచు విషయ
ధ్యానంబునఁజేసి స్వాప్నికార్థాగమ సం
ధాము రీతి నసత్పథ
మాసుఁ డగుచున్ భ్రమించు తిలోలుండై.

టీకా:

పూని = పూని; చరించుచున్ = వర్తించుచు; విషయ = ఇంద్రియార్ఠములను; ధ్యానంబున్ = స్మరించుట; చేసి = వలన; స్వాప్నిక = కలలోని; అర్థ = ధనము; ఆగమ = లభించుట; సంధానమున్ = కలిగిన; రీతిన్ = వలె; అసత్ = సత్యము కాని, చెడు; పథ = మార్గముల పోవు; మానసుండు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; భ్రమించున్ = తిరుగును; మతి = మనసున; లోలుడు = చంచలత్వము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

చరిస్తూ, విషయసుఖాలను స్మరిస్తూ, కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడుమార్గాలలో ప్రవర్తిసుంది. అతడు చంచలబుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు.