పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-905-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు తిర్యఙ్మనుజస్థా
రూపము లగుచుఁ గర్మవాసనచేతం
పైన మిశ్రయోనులఁ
దిముగ జనియించి సంసృతిం గైకొని తాన్.

టీకా:

సుర = దేవతా; తిర్యక్ = జంతు {తిర్యక్కులు - తమంతతాము తిరుగు సామర్థ్యము కలవి, జంతువులు, నం,విణ, అడ్డముగా పోవునది, }; మనుజ = మానవ; స్థావర = వృక్షాదులు {స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, 2.చురుకుదనము లేనివి, వృక్షములు మొదలైనవి, వ్యు. స్థా – స్థా(గతి నివృతో) + వరచ్, కృ,ప్ర.}; రూపముల్ = స్వరూపులను; అగుచున్ = చెందుతూ; కర్మ = కర్మముల; వాసన = సంస్కారముల; చేతన్ = వలన; పరపు = ప్రయోగింపడినవి; ఐన = అయిన; మిశ్రమ = వివిధములైన; యోనులన్ = గర్భము లందు; తిరముగన్ = అవశ్యము; జనియించి = పుట్టి; సంసృతిన్ = సంసారమును; కైకొని = చేపట్టి; తాన్ = అతను.

భావము:

సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసికొని సంసార బంధాలలో చిక్కుపడి...