పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-894-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది దేవతారూపంబుల నుండు దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండు తామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రం బై యుండు; మఱియును.

టీకా:

అది = అది; దేవతా = దేవతల యొక్క; రూపంబులన్ = రూపములలో; ఉండున్ = ఉండును; తైజసాహంకారంబు = రజోహంకారము; బుద్ధి = బుద్ధి; ప్రాణంబులున్ = ప్రాణములు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; తామసాహంకారంబున్ = తామసాహంకారము; ఇంద్రియ = ఇంద్రియముల; మేళనంబునన్ = కలియక యందు; అర్థ = పేరుకి; మాత్రంబు = మాత్రమే; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; మఱియును = ఇంకను.

భావము:

ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసాహంకారం బుద్ధిరూపాన్నీ, ప్రాణరూపాన్నీ కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజనమాత్రమై ఉంటుంది. ఇంకా...