పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-890-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్రమునఁ ద్రిగుణము నవ్య
క్తము నిత్యము సదసదాత్మము మఱియుఁ బ్రధా
ము ననఁగాఁ బ్రకృతివిశే
ము లదియు విశిష్ట మనిరి ద్విదు లెలమిన్.

టీకా:

క్రమమున = క్రమముగ; త్రిగుణమున్ = త్రిగుణములు; అవ్యక్తమున్ = అవ్యక్తము; నిత్యమున్ = నిత్యము; సత్ = సత్తు; అసత్ = అసత్తు; ఆత్మకమున్ = కూడినది; మఱియున్ = మరియు; ప్రధానమున్ = ప్రధానము {ప్రధానము - (ముందు చెప్పిన లక్షణములకు) ఆధారమైనది, వేదములలో అదితి అనబడును}; అనగా = అను వీనిని; ప్రకృతి = ప్రకృతి యొక్క; విశేషములు = విశేషములు; అదియు = అదియు; విశిష్టము = విశిష్టమైనవి; అనిరి = అన్నారు; సత్ = మంచిగ; విదులు = తెలిసినవారు; ఎలమిన్ = వ్యక్తముగ.

భావము:

“త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం, ప్రధానం అనేవి ప్రకృతి విశేషాలు. ఈ విశేషాలతో కూడి ఉన్నది కనుక ప్రకృతిని విశిష్టం అని ప్రాజ్ఞులు పేర్కొన్నారు.