పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-880-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా
ణిమాద్యష్టవిభూతి సేవితము నిత్యానంద సంధాయియున్
నాతీతము నప్రమేయము సమగ్రశ్రీకమున్ సర్వల
క్షయుక్తంబును నైన మోక్షపదవిం గైకొందు రత్యున్నతిన్.

టీకా:

కణకన్ = పూని; వారలు = వారు; వెండి = మరియు; మోక్ష = మోక్షమును; నిరపేక్ష = కోరని; స్వాంతులు = స్వాంతన చెందిన మనసు కలవారు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; తాము = తాము; అణిమ = అణిమ; ఆది = మొదలైన; అష్టవిభూతి = అష్ట విభూతులచే {అష్ట విభూతులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము}; సేవితము = సేవింపబడునది; నిత్య = శాశ్వతమైన; ఆనంద = ఆనందమును; సంధాయియున్ = కలిగించునదియున్; గణన = ఎంచుటకు, లెక్కించుటకు; అతీతమున్ = అందనిదియును; అప్రమేయమున్ = ప్రమాణములకు అందనిదియును; సమగ్ర = పరిపూర్ణమైన; శ్రీకమున్ = సంపదయును; సర్వ = సమస్తమైన; లక్షణ = లక్షణములతోను; సంయుక్తంబున్ = కూడినదియును; మోక్ష = మోక్షము అను; పదవిన్ = స్థితిని; కైకొందురు = పొందుదురు; అతి = మిక్కిలి; ఉన్నతిన్ = గొప్పదనముతో.

భావము:

ఆ విధంగా మోక్షాసక్తి లేనివారై కూడా వారు అణిమాది అష్టసిద్ధి సంసేవితమూ, శాశ్వతానంద సంధాయకమూ, వర్ణనాతీతమూ, మహనీయమూ, సంపూర్ణ వైభవోపేతమూ, సకలలక్షణ సమేతమూ, మహోన్నతమూ అయిన వైకుంఠధామాన్ని పొందుతారు.