పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-873-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దియు నారాయణాసక్త య్యెనేని
మోక్షకారణ మగు" నని మునికులాబ్ధి
చంద్రుఁ డన నొప్పు కపిలుండు ననితోడ
ర్థి వినఁ జెప్పి మఱియు నిట్లనియెఁ బ్రీతి.

టీకా:

అదియున్ = అదే; నారాయణ = గోవిందుని యందు {నారాయణుడు - నారములు (నీరు) అందు నివసించువాడు, విష్ణువు}; ఆసక్తము = తగులుకొనినది; అయ్యెన్ = అయినట్లు; ఏని = అయితే; మోక్ష = మోక్షమునకు; కారణమున్ = కారణము; అగున్ = అగును; అని = అని; ముని = మునుల; కుల = సమూహము అను; అబ్ధి = సముద్రమునకు; చంద్రుడు = చంద్రుని వంటివాడు, ఉప్పొంగించువాడు; అనన్ = అనుటకు; ఒప్పు = తగినవాడు; కపిలుండు = కపిలుడు; జనని = తల్లి; తోడన్ = తోటి; అర్థిన్ = కుతూహలముతో; వినన్ = వినునట్లు; చెప్పి = చెప్పి; మఱియును = ఇంకను; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ప్రేమతో.

భావము:

ఆ చిత్తం శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనపుడు మోక్షానికి హేతువవుతుంది” అని మునికుల సాగరానికి చంద్రుని వంటివాడైన కపిలుడు తల్లికి కోరికతో వినిపించి, మళ్ళీ ఆప్యాయంగా ఇలా అన్నాడు.