పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-871-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని మందస్మిత లలితా
కమలుం డగుచు నెమ్మమునఁ బ్రమోదం
యంబు గడలుకొన నిజ
నికి నిట్లనియెఁ బరమశాంతుం డగుచున్.

టీకా:

విని = విని; మందస్మిత = చిరునవ్వుతో; లలితా = అందమైన; ఆనన = మోము అనెడి; కమలుండు = కమలము కలవాడు; అగుచున్ = అవుతూ; నెఱి = నిండైన; మనంబునన్ = మనసులో; ప్రమోదంబున్ = సంతోషము; అనయంబున్ = మిక్కిలిగ; కడలుకొనన్ = అతిశయింపగా; నిజ = తన; జనని = తల్లి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; పరమ = అత్యంత; శాంతుడున్ = శాంతము కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

విని, మందహాస సుందర వదనారవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా పరమశాంతుడై కన్నతల్లితో ఇలా అన్నాడు.