పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-869-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూరి మదీయ మోహతమముం బెడఁబాప సమర్థు లన్యు లె
వ్వాలు నీవకాక నిరద్య! నిరంజన! నిర్వికార! సం
సాలతాలవిత్ర! బుధత్తమ! సర్వశరణ్య! ధర్మవి
స్తాక! సర్వలోకశుభదాయక! నిత్యవిభూతినాయకా!

టీకా:

భూరి = అత్యధికమైన {భూరి - 1 తరవాత 34 సున్నాలు ఉండు సంఖ్య అదే కోటి అయితే 7 సున్నాలే}; మదీయ = నా యొక్క; మోహ = మోహము అనెడి; తమమున్ = చీకటిని; ఎడబాప = దూరము చేయుట; సమర్థులు = చేయగలవారు; అన్యులు = ఇతరులు; ఎవ్వారలు = ఎవ రున్నారు; నీవ = నీవు; కాక = కాకుండగ; నిరవద్య = లోపములు లేనివాడ; నిరంజన = అసహాయ దర్శనుడ; నిర్వికార = మనోవికారములు లేనివాడ; సంసారలతాలవిత్ర = సంసారమను లతలకు కొడవలి వంటివాడ; బుధసత్తమ = జ్ఞానులలో ఉత్తమ; సర్వశరణ్య = సర్వులకును శరణ్యమైనవాడ; ధర్మవిస్తారక = ధర్మమును విస్తరించువాడ; సర్వలోకశుభదాయక = సమస్త లోకములకు శుభములు కలిగించువాడ; నిత్యవిభూతినాయకా = శాశ్వతమైన వైభవములను నడపువాడ.

భావము:

లోపాలు లేనివాడవు, అసహాయ దర్శనం కలవాడవు, మనోవికారాలు లేనివాడవు, సంసారమనే తీగలకు కొడవలి వంటివాడవు, జ్ఞానులలో ఉత్తముడవు, అందరికి శరణు కోరదగినవాడవు, ధర్మమును విస్తరించేవాడవు, శాశ్వతమైన వైభవములకు అధినాయకుడవు అయిన ఓ కపిలా! నా అంతులేని వ్యామోహమనే చీకటిని దూరం చేయడానికి నీవు కాక ఇతరు లెవరున్నారు?