పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని తపోయాత్ర

  •  
  •  
  •  

3-865-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిగణ సేవిత మగు వన
ముకుం జని యందు మౌనమున నిస్సంగుం
డును వహ్నిరహితుఁ డనికే
నుఁడై యాత్మైకశరణ త్పరు డగుచున్.

టీకా:

ముని = మునుల; గణ = సమూహములచే; సేవితము = కొలువబడునది; అగు = అయిన; వనమున్ = తపోవనమున; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = దానిలో; మౌనమునన్ = మౌనముగ; నిస్సంగుడునున్ = తగులములు లేనివాడును; వహ్ని = అగ్నిహోత్రము; రహితుడు = విడిచిపెట్టినవాడు; అనికేతనుడు = ఇల్లు లేనివాడు; ఐ = అయ్యి; ఆత్మ = పరమాత్మ; ఏక = ఒక్కనికే; శరణ = శరణువేడుట యందు; తత్పరుడు = లగ్నమైనవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

కర్దముడు మునులు నివసించే అరణ్యానికి వెళ్ళి, అక్కడ మౌనవ్రతాన్ని పాటిస్తూ, లోకసంబంధాలను త్యజించి, హోమాది అగ్నికార్యాలను విడిచి, స్థిరనివాసం లేనివాడై, తనలోని పరమాత్మనే శరణు జొచ్చినవాడై....