పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కన్యకానవక వివాహంబు

  •  
  •  
  •  

3-861-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁ బరమేశుఁ బరంజ్యో
తిని ననఘు ననంతు దేవదేవు సకలభూ
నికాయగుహాశయు నా
ద్యుని నజు నాద్యంతశూన్యు దురితవిదూరున్.

టీకా:

ననున్ = నన్ను; పరమేశున్ = భగవంతుని {పర మేశుడు - పరమ (అత్యున్నతమైన) ఈశుడు, విష్ణువు}; పరంజ్యోతిన్ = భగవంతుని {పరం జ్యోతి - పరమము (కేవలము) అయిన జ్యోతిస్వరూపుడు, విష్ణువు}; అనఘున్ = భగవంతుని {అనఘుడు - పాపము లేనివాడు, విష్ణువు}; అనంతున్ = భగవంతుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; దేవదేవున్ = భగవంతుని {దేవదేవుడు - దేవుళ్ళకు దేవుడు, విష్ణువు}; సకలభూతనికాయగుహాశయున్ = భగవంతుని {సకల భూత నికాయ గుహాశయుడు - సకల (సమస్తమైన) భూతనికాయము (జీవజాలము) యొక్క గుహ (హృదయము) నందు శయుడు (పడుకొని ఉండువాడు), విష్ణువు}; ఆద్యున్ = భగవంతుని {ఆద్యుడు - ఆది (మొదట) నుండి ఉన్నవాడు, విష్ణువు}; అజున్ = భగవంతుని {అజుడు - జన్మము లేనివాడు}; ఆద్యంతశూన్యున్ = భగవంతుని {ఆద్యంత శూన్యుడు - ఆది (మొదలు) అంతము(చివర) లు లేనివాడు}; దురితవిదూరున్ = భగవంతుని {దురిత విదూరుడు - దురితముల (పాపములు) విదూరుడు (పోగొట్టువాడు), విష్ణువు};

భావము:

పరమేశ్వరుడను, పరంజ్యోతిని, అనఘుడను, అనంతుడను, దేవదేవుడను, సమస్త ప్రాణుల హృదయాంతరాళలో నివసించేవాడను, ఆద్యుడను, అజుడను, ఆద్యంత రహితుడను, దురితదూరుడను అయిన నన్ను....