పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కన్యకానవక వివాహంబు

  •  
  •  
  •  

3-855-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుహిత తత్త్వజ్ఞానా
ర్థము విద్వజ్జనగణంబు విలి నమస్కా
ము లోలిఁ జేయు పదపీ
ము గల నినుఁ బొగడవశమె వణిల్లంగన్.

టీకా:

సుమహిత = మిక్కిలి గొప్పదైన; తత్త్వ = తత్త్వము గురించిన; జ్ఞాన = జ్ఞానమును; అర్థమున్ = కోరి; విద్వత్ = విద్వాంసులు అయిన; జన = జనముల; గణంబున్ = సమూహములు; తవిలి = లగ్నులై; నమస్కారములున్ = నమస్కారములు; ఓలిన్ = వరుసగా; చేయు = చేస్తుండే; పద = పాదములు ఉంచుకొను; పీఠమున్ = పీట; కల = కలిగిన; నినున్ = నిన్ను; పొగడన్ = కీర్తించుట; వశమే = శక్యమా ఏమిటి; ఠవణిల్లంగన్ = నొక్కిచెప్పాలంటే.

భావము:

పరమ పవిత్రమైన తత్త్వజ్ఞానాన్ని పొందడం కోసం విద్వాంసులైనవారు విడువకుండా నమస్కరించే పాదపీఠం కల నిన్ను వర్ణించడం ఎవరికి సాధ్యం?