పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కన్యకానవక వివాహంబు

  •  
  •  
  •  

3-850.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిరసమాధి తపోనిష్ఠచే వివిక్త
దేశముల యోగిజనములు ధృతుల నే మ
హానుభావు విలోకింతు ట్టి దివ్య
పురుషరత్నంబ! నా యింటఁ బుట్టి తీవు.

టీకా:

చతురాత్మ = చాతుర్యముకలవాడ;, {విష్ణుసహస్రనామములు శ్రీశంకర భాష్యం 137వ నామం, 769వ నామం, బ్రహ్మ, ప్రజాపతులు, కాలము, జీవులు సృష్టి విభూతులును, విష్ణు, మన్వాదులు, కాలము, భూతములు స్థితి విభూతులును, రుద్ర, కాల, అన్తకాదులు, జంతువులు లయ విభూతులును అను నాలుగు విభూతుల త్రయం కలవాడు} వినుము = వినుము; ఆత్మ = తాము; కృతములు = చేసికొన్నవి; ఐనట్టి = అయినట్టి; అమంగళ = చెడుగా; ఆభూత = పరిణమించునట్టి; కర్మంబులన్ = పనులు; అనెడి = అనే; దావాగ్ని = కారుచిచ్చు {దావాగ్ని - దావము (అడవి) అందలి అగ్ని, కారుచిచ్చు}; శిఖలు = మంటల; చేన్ = వలన; దందహ్యమానులు = కాలిపోతున్నవారు; ఐనట్టి = అయినట్టి; జీవులున్ = ప్రాణులు; తుదముట్టలేక = ఆర్పివేయలేక; పాయక = బయటపడలేక; సంసార = సంసారమునకు; బద్ధులు = కట్టబటినవారు; ఐ = అయ్యి; ఉందురు = ఉంటారు; తత్ = ఆ; భవ = సంసారమునకు; హేతు = కారణ; భూతంబులు = అంశములు; అయిన = అయినట్టి; సకల = సమస్తమైన; దేవతలునున్ = దేవతలును; ప్రసన్నులు = ప్రసన్నమైనవారు; అగుదురు = అవుతారు; బహు = అనేక; జన్మ = జన్మములనుండి; పరిచిత = తెలిసి; ప్రాప్త = పొందిన; యోగ = యోగముల యొక్క; చిర = అధికమైన; సమాధి = సమాధియును; తపస్ = తపస్సు యొక్క; నిష్ఠ = నిష్ఠలు; చే = వలన;
వివిక్త = ఒంటరి; దేశములన్ = ప్రదేశములందు; యోగి = యోగులైన; జనములు = జనులు; ధృతులన్ = ధారణలచే; ఏ = ఏ; మహానుభావున్ = గొప్పవానిని; విలోకింతురు = దర్శించెదరో; అట్టి = అటువంటి; దివ్య = దివ్యమైన; పురుష = పురుషులలో; రత్నంబ = రత్నము వంటివాడా; నా = నా యొక్క; ఇంటన్ = ఇంటిలో; పుట్టితివి = జన్మంచితివి; ఈవున్ = నీవు.

భావము:

“ఓ మహాత్మా! విను. పూర్వం తాము చేసిన అమంగళ కార్యాలు అనే కార్చిచ్చులో కాలిపోతూ ఉన్న జీవులు బైట పడలేక ఎడతెగని సంసార బంధాలలో బంధింపబడి ఉంటారు. అనేక పూర్వ జన్మల పరిచయం వల్ల ప్రాప్తించిన తపస్సు, యోగసమాధి నిష్ఠలు వలన, అట్టి భవ సంసార కారణభూతులైన దేవతలు ప్రసన్నులు అవుతారు. ఆ యోగనిష్ఠా గరిష్ఠులైన యోగిశ్రేష్ఠులు, ఏకాంత ప్రదేశంలో ఏమరుపాటు లేక ఏ మహానుభావుణ్ణి దర్శిస్తారో అటువంటి దేవాదిదేవుడవైన నీవు నా ఇంటిలో జన్మించావు.