పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-845-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు-
ను నుపాయంబుల నొరఁజేసి
వుమైఁ గర్మజీవు నుద్ధరించుట-
కొఱకు నమ్మహితాత్మకుఁడు సమగ్ర
హాకరుచిజటాజూటుండు సత్ఫుల్ల-
పంకజనేత్రుండు ద్మ వజ్ర
ల కులిశాంకుశ లిత రేఖాంకిత-
రణ తలుండును త్త్వగుణుఁడు

3-845.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుచు నిప్పుడు సరసీరుహాక్షి నీదు
ర్భ మం దుదయించెను నుఁడు నీకుఁ
త్త్వబోధంబుఁ గావించుఁ దావకీన
హృదయ సంగత సంశయ మెల్లఁ బాపు.

టీకా:

మానిత = గౌరవింపదగిన; జ్ఞాన = జ్ఞానము {జ్ఞానము - పరవిద్య, ఆధ్యాత్మికమైన విషయములను తెలుపునది}; విజ్ఞానము = విజ్ఞానము {విజ్ఞానము - అపరవిద్య, అవిద్య, లౌకిక విషయములను తెలుపునది}; యోగంబులున్ = యోగములును; అను = అనెడి; ఉపాయంబులన్ = ఉపాయములను; ఒనరన్ = కలుగునట్లు; చేసి = చేసి; అలవుమై = సామర్థ్యముచేత; కర్మజీవులన్ = మానవులను {కర్మజీవులు - కర్మబద్ధులైన జీవులు, మానవులు}; ఉద్ధరించుట = ఉద్ధరించుట; కొఱకున్ = కోసము; ఆ = ఆ; మహిత = గొప్ప; ఆత్మకుడు = ఆత్మకలవాడు; సమగ్ర = చక్కటి; హాటక = బంగారు; రుచి = రంగు కల; జటాజూటుండు = జటలు చుట్టుకుపోయి ఉన్నవాడు; సత్ = మంచిగ; ఫుల్ల = వికసించిన; పంకజ = పద్మము వంటి {పంకజము - పంక (నీటి) లో జము (పుట్టినది), పద్మము}; నేత్రుడు = కన్నులు కలవాడు; పద్మ = పద్మము; వజ్ర = వజ్రము; హల = నాగలి; కులిశ = అంకుశ; లలిత = చక్కటి; రేఖా = గీతలచే; అంకిత = అలంకరింపబడిన; చరణతలుండును = అరికాలు కలవాడును; సత్త్వగుణుడును = సత్త్వగుణము కలవాడును; అగుచున్ = అవుతూ; ఇప్పుడు = ఇప్పుడు;
సరసీరుహాక్షి = నారాయణుడు {సరసీరుహాక్షి - సరసీరుహము (పద్మముల) వంటి అక్షి (కన్నులుకలవాడు), విష్ణువు}; నీదు = నీ యొక్క; గర్భమున్ = కడుపు; అందున్ = లో; ఉదయించెను = పడెను; ఘనుడు = గొప్పవాడు; నీకున్ = నీకు; తత్త్వ = తత్త్వ జ్ఞానమును; బోధంబున్ = బోధించుటను; కావించున్ = చేయును; తావకీన = నీ యొక్క; హృదయ = మనసున; సంగత = ఉన్నట్టి; సంశయము = సందేహము; ఎల్లన్ = సమస్తమును; పాపు = తొలగించును;

భావము:

ఓ దేవహూతీ! మాననీయాలైన జ్ఞానవిజ్ఞాన యోగాలు అనబడే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికై కమలాక్షుడు నీ కడుపున జన్మించాడు. బంగారు రంగు కలిగిన జటాజూటం కలవాడు, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడు, పద్మం, హలం, వజ్రం, అంకుశం మొదలైన రేఖలతో విరాజిల్లే అరికాళ్ళు కలవాడు, సత్త్వగుణ సంపన్నుడు అయి ఇప్పుడు నీ గర్భంలో జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్త్వబోధ చేస్తాడు. దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరిపోతాయి.