పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-841-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రిభయహరణుఁడు మునిజన
నుచరితుఁడు పరుఁడు మీ మనోరథసిద్ధిన్
వితంబుగఁ గావించుటఁ
తురత మీ జన్మ మింక ఫలతఁ బొందెన్.

టీకా:

శ్రితభయహరణుడు = నారాయణుడు {శ్రిత భయ హరణుడు - శ్రిత (ఆశ్రయించినవారి) భయ (భయమును) హరణుడు (హరించువాడు), విష్ణువు}; మునిజననుతచరితుఁడు = నారాయణుడు {ముని జన నుత చరితుడు - మునులగు జనములచే నుత (స్తుతింబడిన) చరితుడు (నడవడిక కలవాడు), విష్ణువు}; పరుఁడు = నారాయణుడు {పరుఁడు - అతీతుడు, విష్ణువు}; మీ = మీ యొక్క; మనోరథ = కోరికలు; సిద్ధిన్ = తీరుట; వితతమున్ = విస్తారముగ; కావించుటన్ = చేయుటచే; చతురతన్ = చక్కగ; మీ = మీ యొక్క; జన్మము = జన్మము; ఇంకన్ = మరి; సఫలతన్ = సాఫల్యమును; పొందెన్ = చెందినది.

భావము:

ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడు, మునీశ్వరులు కీర్తించే చరిత్ర గలవాడు అయిన పరాత్పరుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చాడు. అందువల్ల మీ జన్మ సార్థకం అయింది.