పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-838.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాధుజనముల మనములు సంతసిల్లె
హోమవహ్నులు ప్రభలఁజెన్నొంది వెలిఁగెఁ
గుసుమఫలభరములనొప్పెఁగుజములెల్ల
ర్వసస్యాళి చెన్నొందె గతిలోన

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆకాశమునన్ = ఆకాశములో; దేవ = దేవతల; తూర్య = బాజాల; ఘోషంబులు = ధ్వనులు; తుములము = విజృంభించినవి; అయ్యెన్ = అయినవి; నందిత = అనందించిన; దేవతా = దేవతల; బృందములు = సమూహములు; అందంద = అక్కడక్కడ; కురిసిరి = కురిపించిరి; మందార = మందార; కుసుమ = పూల; వృష్టి = వాన; గంధర్వ = గంధర్వుల; కిన్నర = కిన్నరల; గానంబున్ = గానములు; వీతెంచెన్ = వినిపించెను; అప్సర = అప్సరసల; గణమున్ = సమూహముల; ఆటలన్ = నాట్యములతో; ఒప్పెను = ఒప్పినవి; వావిరిన్ = మిక్కిలిగా; దిక్కులన్ = దిక్కులను; కావిరి = నలుపు, చీకటి; విరిసెను = విరిగిపోయినది; తవిలి = పూని; వార్థులన్ = సముద్రములలో; కలంతలున్ = కలవరపాటులు; మానెన్ = మానినవి;
సాధు = సాదువులైన; జనముల = జనుల; మనములున్ = మనసులును; సంతసిల్లెన్ = సంతోషించినవి; హోమ = హోమములందలి; వహ్నులు = అగ్నులు; ప్రభలన్ = కాంతులతో; చెన్నొంది = చక్కగ; వెలిగెన్ = వెలిగినవి; కుసుమ = పువ్వులు; ఫల = పండ్లు యొక్క; భరములన్ = బరువులతో; ఒప్పెన్ = చక్కగా ఉన్నవి; కుజములు = చెట్లు {కుజములు - కు (భూమి) అందు జములు (పుట్టినవి), వృక్షములు}; ఎల్లన్ = అన్నీ; సర్వ = సమస్తమైన; సస్య = ధాన్యముల; ఆవళి = రాసులు; చెన్నొందెన్ = అందము సంతరించుకొన్నవి; జగతి = లోకము; లోనన్ = లో.

భావము:

ఆ సమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాద్యాలు ధ్వనించాయి. దేవతలందరూ సంతోషంతో మందారపుష్పాల వర్షాన్ని కురిపించారు. గంధర్వులూ, కిన్నరులూ పాటలు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. దిక్కుల్లో క్రమ్మిన పొగమంచు మాయమయింది. సముద్రాలు ప్రశాంతాలైనాయి. సజ్జనుల మనస్సులకు సంతోషం కలిగింది. హోమాగ్నులు మిక్కిలి తేజస్సుతో వెలిగాయి. వృక్షాలన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. పొలాలలో నానావిధాలైన పైరులు ప్రకాశించాయి.