పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-837-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రియించి యమ్మునీంద్రుని
రుణీగర్భంబువలన నుజారి శమీ
రుకోటరమున వైశ్వా
రుఁ డుదయించిన విధంబునన్ జనియించెన్.

టీకా:

ధరియించి = తాల్చి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; తరుణీ = భార్య యొక్క; గర్భంబున్ = గర్భము; వలన = అందు; దనుజారి = హరి {దనుజారి - దనుజుల (రాక్షసుల)కు అరి (శత్రువు), విష్ణువు}; శమీ = జమ్మి; తరు = చెట్టు; కోటరమునన్ = తొఱ్ఱలో; వైశ్వానరుడు = అగ్నిహోత్రుడు; ఉదయించిన = పుట్టిన; విధంబునన్ = విధముగ; జనియించెన్ = పుట్టెను.

భావము:

(విష్ణువు కర్దముని తేజస్సును) ధరించి జమ్మిచెట్టు తొఱ్ఱలో నుంచి అగ్ని పుట్టినట్లుగా దేవహూతి గర్భంలోనుండి జన్మించాడు.