పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-835-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి నారాయణు పాదపద్మములు సమ్యగ్భక్తిఁ బూజింపు త
త్పురుషశ్రేష్ఠుఁడు మానసంబున భవత్పూజా సుసంప్రీతుడై
మర్థిం దరుణీశిరోమణి! భవద్గర్భస్థుఁడై యుండి తాఁ
రుణం జేయు భవన్మనోజనిత శంకాగ్రంథి విచ్ఛేదమున్."

టీకా:

హరి = గోవిందుని; నారాయణు = నారాయణుని; పాద = పాదములు అనెడి; పద్మములున్ = పద్మములను; సమ్యక్ = చక్కని; భక్తిన్ = భక్తితో; పూజింపు = కొలువుము; తత్ = ఆ; పురుషశ్రేష్ఠుడు = గోవిందుడు {పురుషశ్రేష్ఠుడు - పురుషులలో శ్రేష్ఠుడు, విష్ణువు}; మానసంబునన్ = మనసులో; భవత్ = నీ యొక్క; పూజన్ = సేవకు; సు = మంచిగా; సంప్రీతుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; కరము = మిక్కిలి; అర్థిన్ = వేడుకగా; తరుణీ = వనితలలో {తరుణి - తరణమైన వయసులో ఉన్న ఆమె, స్త్రీ}; శిరోమణి = ఉత్తమురాల {శిరోమణి - శిరసున ధరించు రత్నాభరణము వంటిది, ఉత్తమురాలు}; భవత్ = నీ యొక్క; గర్భస్తుడు = కడుపునపడ్డవాడు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; తాన్ = తను; కరుణన్ = దయతో; చేయున్ = చేయును; భవత్ = నీ యొక్క; మనస్ = మనసులో; జనిత = పుట్టిన; శంకా = సందేహముల; గ్రంథిన్ = ముడుల; విచ్ఛేదమున్ = తొలగించుటను.

భావము:

నారాయణుని పాదపద్మాలను నిండైన భక్తితో పూజించు. పురుషోత్తముడైన ఆ విష్ణువు నీ పూజలకు సంతృప్తి చెంది నీ గర్భంలో నివసిస్తాడు. నీ మనస్సులో పుట్టే సందేహాల ముడులను విడదీస్తాడు”.